Anti-Hijab Protest row: సోదరుడి సమాధిపై జుట్టు కత్తిరించుకున్న అమ్మాయి.. వీడియో వైరల్

తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట్టు కత్తిరిస్తూ తెలుపుతారు’’ అని ఇరాన్ జర్నలిస్టులు పేర్కొన్నారు.

Anti-Hijab Protest row: సోదరుడి సమాధిపై జుట్టు కత్తిరించుకున్న అమ్మాయి.. వీడియో వైరల్

Anti-Hijab Protest row

Anti-Hijab Protest row: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతోన్న ఆందోళనల్లో చనిపోయిన ఓ యువకుడి సమాధిపై అతడి సోదరి జట్టు కత్తిరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆందోళనలు తీవ్రతరం కావడంతో పోలీసులు 700 మందిని అరెస్టు చేశారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరే జావద్ హెదరి. అతడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హాజరయ్యారు. తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట్టు కత్తిరిస్తూ తెలుపుతారు’’ అని ఇరాన్ జర్నలిస్టులు పేర్కొన్నారు.

కాగా, ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఘర్షణల్లో పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేశారు. కఠిన చట్టాలు, హిజాబ్ నిబంధనలు వద్దంటూ ఇరాన్ ప్రజలు నినదిస్తున్నారు.

COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు