Afghanistan people celebrations: శ్రీలంక చేతిలో పాక్ చిత్తుగా ఓడినందుకు అఫ్గాన్‌లో సంబరాలు.. వీడియో వైరల్

శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ విజయం సాధించిన అనంతరం అఫ్గానిస్థాన్ అభిమానులు రెచ్చిపోవడంతో ఇరుజట్ల అభిమానులు వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

Afghanistan people celebrations: శ్రీలంక చేతిలో పాక్ చిత్తుగా ఓడినందుకు అఫ్గాన్‌లో సంబరాలు.. వీడియో వైరల్

Afghanistan people celebrations

Afghanistan people celebrations: శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ విజయం సాధించిన అనంతరం అఫ్గానిస్థాన్ అభిమానులు రెచ్చిపోవడంతో ఇరుజట్ల అభిమానులు వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోయింది. దీంతో పాక్ కు తగినశాస్తి జరిగిందంటూ అఫ్గాన్ అభిమానులు బాణసంచా కాల్చారు. అఫ్గాన్ లో వారు సంబరాలు చేసుకుంటోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వీధిలోకి వచ్చి ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ గడిపారు. కాగా, నిన్నటి మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు