Lord Ganesha: ఇండొనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఇప్పుడూ ఉందా?

ఇండినేషియాలో 86.7 శాతం మంది ముస్లింలే ఉంటారు. అయినప్పటికీ, 1998లో ఓ సారి వినాయకుడి ఫొటోతో కరెన్సీ ముద్రించారు. అయితే, ఇప్పుడు గణేశుడి ఫొటో ఉండే ఆ కరెన్సీ చలామణీలో లేదు. అప్పట్లో వారి కరెన్సీపై ఓ వైపు గణేశుడి బొమ్మ, ఓ వ్యక్తి ఫొటో ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఇండొనేషియాలో డెన్మార్క్‌ పాలన కాలంలో అక్కడి ప్రజల చదువు హక్కు కోసం పోరాడిన దేవాంతర అనే నాయకుడు. మరోవైపు చూస్తే చదువుకుంటున్న చిన్నారుల ఫొటో కనపడుతోంది. ఇండొనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉండడం ఆ దేశ భిన్న సంస్కృతిని చూపిస్తోంది. ఎడ్యుకేషన్ థీమ్ కు సంబంధించిన ఆ కరెన్సీని అప్పట్లో విడుదల చేశారు.

Lord Ganesha: ఇండొనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఇప్పుడూ ఉందా?

Lord Ganesha: దేశంలో కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి ఫొటోలు ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరడం చర్చనీయాంశంగా మారింది. కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని, ఈ విజ్ఞప్తితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆయన ఇటీవలే చెప్పారు. ఆ దేవుళ్ల ఫొటోలను కరెన్సీపై ముద్రిస్తే దేశ శ్రేయస్సుకు ఉపయోగకరమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇండొనేషియా కరెన్సీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఆ దేశంలో కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉన్నప్పుడు హిందువులు అధికంగా ఉండే మన దేశ కరెన్సీపై ఎందుకు ఉండకూడదని ఆయన నిలదీశారు. దీంతో నిజంగానే ఇండొనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉంటుందా? అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ఇండినేషియాలో 86.7 శాతం మంది ముస్లింలే ఉంటారు. అయినప్పటికీ, 1998లో ఓ సారి వినాయకుడి ఫొటోతో కరెన్సీ ముద్రించారు. అయితే, ఇప్పుడు గణేశుడి ఫొటో ఉండే ఆ కరెన్సీ చలామణీలో లేదు. అప్పట్లో వారి కరెన్సీపై ఓ వైపు గణేశుడి బొమ్మ, ఓ వ్యక్తి ఫొటో ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఇండొనేషియాలో డెన్మార్క్‌ పాలన కాలంలో అక్కడి ప్రజల చదువు హక్కు కోసం పోరాడిన దేవాంతర అనే నాయకుడు.

మరోవైపు చూస్తే చదువుకుంటున్న చిన్నారుల ఫొటో కనపడుతోంది. ఇండొనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉండడం ఆ దేశ భిన్న సంస్కృతిని చూపిస్తోంది. ఎడ్యుకేషన్ థీమ్ కు సంబంధించిన ఆ కరెన్సీని అప్పట్లో విడుదల చేశారు. ఇండొనేషియాలో గణేశుడిని జ్ఞానానికి, కళలకు, చదువుకు ప్రతీకగా చూస్తారు. కరెన్సీపైనే కాదు అక్కడి పవు విద్యా సంస్థల్లోనూ గణేశుడి బొమ్మలు ఉంటాయి. అంతేకాదు, ప్రస్తుతం ఇండొనేషియాలో చలామణీలో ఉన్న 50 వేల కరెన్సీ నోటు మీద ఓ హిందూ దేవాలయ బొమ్మ కూడా ఉంది.

అది బాలీ ద్వీపంలోని గుడి. అక్కడి కరెన్సీపై హిందూ దేవుళ్ల బొమ్మలే కాకుండా ఇతర మతాలకు చెందిన చిహ్నాలూ కనపడుతాయి. ఇండినేషియా కరెన్సీని రుపయ్య (సంస్కృత పదం రూప్యకం (వెండి) నుంచి తీసుకున్నారు) అని పిలుస్తారు. ఇండినేషియాలో 86.7 శాతం ముస్లింలు, 10.7 శాతం క్రిస్టియన్లు, 1.7 శాతం హిందువులు ఉన్నారు. అయితే, బాలీ ద్వీపంలో 90 శాతం మంది హిందువులే ఉంటారు. 1960-1970 మధ్య చాలా మంది హిందూ మతంలోకి మారినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

అప్పటి నుంచే ఇండొనేషియాలోని ఓ ప్రాంతంలో రామాయణ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకంలో ఇతర మతాలకు చెందిన వారు కూడా నటిస్తారు. ఇండొనేషియాను ఒకప్పుడు హిందూ, బౌద్ధ రాజవంశాల వారు పాలించారు. దీంతో అక్కడ హిందూ మత ఆనవాళ్లు, మందిరాలు, చిహ్నాలు కనపడుతుంటాయి. ఆ దేశ జాతీయ చిహ్నం కూడా గరుడ పక్షే. ఇండొనేషియాలోని బాండుంగ్ సాంకేతిక విశ్వ విద్యాలయం లోగోలోనూ గణేశుడి బొమ్మ ఉంటుంది. ఇండొనేషియా ఎయిర్ లైన్స్ ‘గరుడ’ పేరు ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..