ఫేషియల్ రికగ్నైజేషన్‌తో కరోనాకు అడ్డుకట్ట…రష్యా ఆధునిక టెక్నాలజీ
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్‌ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.

కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్‌ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది.. అంతేకాదు.. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్‌ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. ఆధునిక టెక్నాలజీని కరోనాపై పోరాటానికి వాడుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్… ప్రజాస్వామ్యవాదులు తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వైరస్ అన్ని దేశాల్లో విశ్వరూపం చూపిస్తోన్నవేళ..రష్యా కరోనా పేషెంట్లు, అనుమానితుల కదలికలపై ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌తో నిఘా పెట్టింది.
600మందిని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ట్రేస్
1,70,000 కెమెరాలున్న ఈ ఫేషియల్ రికగ్నజైషన్ ని వాడుకునే గతవారం 200మంది క్వారంటైన్ ఐసోలేషన్ నిబంధనలను మీరినట్లు కనుక్కుంది రష్యా. అర నిమిషం బైటతిరిగినా వెంటనే కనుక్కోవడం ఈ ఫేషియల్ రికగ్నైజేషన్‌తో రష్యాకి సాధ్యపడింది. దీంతో మరో 9వేల కెమెరాలను మాస్కో వీధుల్లో అమర్చేందుకు అధికారులు తయారవుతున్నారు. కరోనా వైరస్ బాధితులు కానీ.. అనుమానితులుగా భావించేవారి సోషల్ నెట్‌వర్క్‌లను కనుక్కోవడం కూడా ఈ టెక్నాలజీతో సాధ్యపడుతోంది.. ఓ చైనా మహిళ బీజింగ్ నుంచి మాస్కోకి వచ్చిన సంగతిని కూడా ఇలానే కనుక్కున్నట్లు మాస్కో మేయర్ సెర్గే సోబ్యానిన్ చెప్పారు. ఒక్క ఆ మహిళనే కాకుండా.. ఆమెని ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చిన టాక్సీ డ్రైవర్.. అపార్ట్ మెంట్లో క్వారంటైన్‌ని అతిక్రమించి ఆమె కలిసిన స్నేహితురాలు సహా మొత్తం 600మందిని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ట్రేస్ చేసారు.
జియో లొకేషన్‌తో ట్రాక్
ఇదొక్కటే కాదు..రష్యాలో ఎవరైతే కరోనా వైరస్ క్యారియర్లుగా అనుమానిస్తున్నారో.. వారందరిని కూడా జియో లొకేషన్‌తో ట్రాక్ చేస్తున్నారు. దీనికి తోడు వీళ్లందరి డేటాతో ఓ ట్రాకింగ్ సిస్టమ్ కూడా రష్యా తయారు చేయబోతోంది.. తద్వారా ఏ ఏరియాలో ఎక్కడ కరోనా ప్రభావం ఉండొచ్చో ముందే స్థానికులకు తెలిసేలా ఓ యాప్ తయారు చేయబోతున్నారు..ఇలా వీలైనంత వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తోంది రష్యా…అంటే ఈ సిస్టమ్‌లో ఎక్కడా సీక్రెసీ ఉండదు..ఎవరు క్యారియర్లవుతారో..ఎవరు ఐసోలేషన్‌లో ఉండాలో..అంతా పబ్లిక్‌కి తెలిసే వీలుంటుంది.. ఇది వ్యక్తిగత హక్కులకు భంగమనే వాదన బైటికి వచ్చినా.. ముందు కరోనా కట్టడే తక్షణ లక్ష్యంగా రష్యా చెప్తోంది..
ఇజ్రాయిల్‌లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా నిఘా
ఇజ్రాయిల్‌లో కూడా ఇలానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా కరోనా పేషెంట్ల కదలికలపై నిఘా పెట్టారు.. వారి ఫోన్ నంబర్లు..క్రెడిట్ కార్డ్ వాడకంతో , వైద్యసిబ్బందితో పాటు స్థానిక అధికారులకు సమాచారం తెలిసేలా పర్యవేక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారు.. ఐతే ఇక్కడ ఇలా తెలుసుకున్న సమాచారాన్ని 60 రోజుల వరకే అందుబాటులో ఉంచి తర్వాత తొలగించేలా ఇజ్రాయిల్ ప్రభుత్వం చూస్తోంది..
సౌత్ కొరియాలో సెల్ పోన్ నంబర్ల జియో లొకేషన్ తో పేషెంట్ల కదలికల పర్యవేక్షణ
సౌత్ కొరియాలో కరోనా వైరస్ అనుమానితులు..పేషెంట్ల కదలికలను సెల్ పోన్ నంబర్ల జియో లొకేషన్, క్రెడిట్ కార్డ్స్ వాడకంతో మ్యాప్ చేసి..పర్యవేక్షిస్తోంది.. ఇదంతా వారి పేర్లు ఇతర వివరాలు తెలీకుండానే పబ్లిక్ వెబ్ సైట్లలో పోస్ట్ చేసి లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంచుతోంది..దీంతో స్థానికులకు ఎక్కడ కరోనా పేషెంట్లు..అనుమానితులు తిరుగుతున్నారో తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియాలకు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు. అమెరికా కూడా ఇదే విధానం అనుసరించబోతోంది..ఐతే రష్యాలోని కొంతమంది మాత్రం కరోనా ఏదో రోజు అంతమవుతుందని.. కానీ పౌరులపై ప్రభుత్వ నిఘా మాత్రం కొనసాగుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.