పాకిస్తానీ పేషెంట్లపై చైనా COVID-19 వ్యాక్సిన్ ట్రయల్స్

పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్‌ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట.

పాకిస్తానీ పేషెంట్లపై చైనా COVID-19 వ్యాక్సిన్ ట్రయల్స్

పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్‌ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట. పాకిస్తాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు ఓ చైనా కంపెనీ లేఖ ద్వారా వ్యాక్సిన్ ను లాంచ్ చేస్తున్నామని తెలిపినట్లు సాదియా అఫ్జల్ అనే జర్నలిస్టు చెబుతున్నారు.

ట్విట్టర్లో ఆమె పంచుకున్న వీడియోల్లో అఫ్జల్ NIH చైర్‌పర్సన్‌తో కలిసి మాట్లాడాడు. దీని ట్రయల్స్ కోసం కనీసం 3నెలల సమయం పడుతుందని చెప్పారు. లెటర్లో కంపెనీ ముందుగా పాకిస్తానీ పేషెంట్ల మీదే వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్లు సారాంశం. ఈ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఫేజ్ 1లో కొంతమందిని ఫేజ్ 2లో కొంతమందిపై పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ ట్రయల్స్ పాకిస్తాన్ లో జరిగి ఒకవేళ సక్సెస్ అయితే ముందుగా పాకిస్తాన్ కే మందు అమ్మాల్సి ఉంటుంది. ఇంకా వ్యాక్సిన్ కు పూర్తి స్థాయి మందు రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. సైంటిఫిక్ కమ్యూనిటీలు ఆ వ్యాక్సిన్ ను ఆమోదించాలంటే పలు దఫాలుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. ఆ తర్వాత మనుషులపై ప్రయోగించడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. పాకిస్తానీ జర్నలిస్టు అయిన సాదియా అఫ్జల్ పాకిస్తాన్ నీటి వనరుల శాఖ మంత్రి ఫైజల్ కు భార్య.