బయటపడ్డ చైనా సీక్రెట్: పదేళ్ల డేటా దొంగిలించిన హ్యాకర్లు

బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్‌బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర్ట్‌ను బయటపెట్టింది. సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉపయోగించి అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించేలా లింక్ లు పంపుతారు.

తక్కువ రిస్క్ ఉన్నట్లుగా ఫీలయి క్లిక్ చేయడంతో.. టార్గెటెడ్ సిస్టమ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలిస్తారు. లో లెవల్ సెక్యూరిటీ టూల్స్ పదుల సంఖ్యలో సిస్టమ్స్ పై ఎఫెక్ట్ చూపించగలవు. వీటిపైనే ఎనిమిదేళ్లుగా హ్యాకర్లు ఫోకస్ పెడుతున్నారు. హ్యాకర్లు ఉపయోగించిన ఈ టూల్స్ కొత్తేవేమీ కావు. లినక్స్ సిస్టమ్స్ పైన గతంలో వాడినవే. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ మైక్రోసాఫ్ట్ విండోస్, గూగుల్ యాండ్రాయిడ్ పైనే పనిచేస్తుండటంతో వారు లినక్స్ సిస్టమ్స్ ను టార్గెట్ చేసుకున్నారు.(లాక్‌డౌన్‌పై మోడీ కీలక నిర్ణయం రేపే..)

ఈ అటాక్‌లు చేయాలనుకునేవారిలో 5విభిన్నమైన గ్రూపులు ఉన్నాయి.  వారు ఒకరికొకరు కలిసే ఆ దేశ పెట్టుబడులతోనే పని చేస్తున్నారు. కానీ, వీటిపై చైనా ప్రభుత్వం తమకు ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.

Linuxనే ఎంచుకోవడం వెనుక కారణం:
హ్యాకర్లు Linuxను ఎంచుకోవడానికి కారణం.. రెగ్యూలర్ గా వాడేవాళ్లలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేది ప్రపంచ వ్యాప్తంగా 2శాతం మాత్రమే డెస్క్‌టాపుల్లో వాడుతున్నారు. కంప్యూటింగ్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటమే కాక, ప్రపంచంలో ఉన్న 500సూపర్ కంప్యూటర్లలో Linux ఆపరేటింగ్ సిస్టమ్ నే వాడుతున్నారు.

2012 మార్చి 13 నుంచి చైనాకు చెందిన ఏపీటీ గ్రూపులు దాడి చేస్తున్నట్లుగా లినక్స్ కూడా ఆమోదించింది. వ్యక్తిగత కంప్యూటర్లతో పాటు పలు సంస్థలకు చెందిన వాటిపైనే హ్యాకర్లు కన్నేశారు. అంటే చైనా ప్రభుత్వం ఇప్పటికే అత్యంత విలువైన సమాచారాన్ని దొంగిలించి దాచి ఉంచిందన్నమాట.