భూమికి రెండో చంద్రుడొచ్చాడు… మారుతీ కారు సైజులో ఉన్నాడు… కలర్‌లో చూడండి.

భూమ్మీదకు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ తెలుసు. దారితెన్నూ ఉండవు కాబట్టే రోగ్ ఆస్టరాయిడ్స్ అని అంటారు. 2020 CD3అని సైంటిస్ట్ పిలిచిన ఈ ఆస్టరాయిడ్ మాత్రం కార్ సైజులో ఉంటుంది. వచ్చే మూడేళ్

భూమికి రెండో చంద్రుడొచ్చాడు… మారుతీ కారు సైజులో ఉన్నాడు… కలర్‌లో చూడండి.

భూమ్మీదకు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ తెలుసు. దారితెన్నూ ఉండవు కాబట్టే రోగ్ ఆస్టరాయిడ్స్ అని అంటారు. 2020 CD3అని సైంటిస్ట్ పిలిచిన ఈ ఆస్టరాయిడ్ మాత్రం కార్ సైజులో ఉంటుంది. వచ్చే మూడేళ్లు భూకక్ష్యలోనే తిరుగుతుందని అనడం కన్నా భూమీ తనచుట్టూ తిప్పుకొంటుంది. చంద్రుడుకున్న అన్న లక్షణాలూ దీనికీ ఉన్నాయి… ఒక్క సైజు తప్ప. అటువైపు వెళ్లిపోతున్న ఈ చిన్న మూన్‌ని భూమే ఇటువైపు ఆకర్షించింది. తనచుట్టూ తిప్పుకొంటుంది.

మూడేళ్ల తర్వాత మూన్‌ని భూమి విశ్వంలోకి విసరేస్తుంది. అంతవరకు మన టెలిస్కోప్‌లు ఈ కొత్త చుట్టాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఈవారంలోనే హువాయ్‌లోని జెమినీ అబ్జర్వేటరీ కలర్ ఫోటో తీసింది. ఫిబ్రవరి 19న Arizonaలోని Catalina Sky Survey ఎక్కడ నుంచే భూమివైపు ఆకాశంలో దూసుకొస్తున్న శకలాన్ని కనిపెట్టింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలన్నీ టెలిస్కోప్‌లను అటువైపు తిప్పాయి.

దీన్ని మినీమూన్‌గా నిర్ధారించాయి. అలాగనే పెద్దదేమీకాదు. 2.9మీటర్లు పొడవు, 3.5 మీటర్ల వెడల్పు. అంటే మిడ్‌సైజు కారు అంతన్నమాట. ఇలా టెంపరరీగా మూన్‌లు రావడం కొత్తమేకాదు. 2006లో  RH120 అన్న శకలం 2006 సెప్టెంబర్ నుంచి 2007 జూన్ వరకు భూమి ఆకర్షణలోనే ఉంది. ఆ తర్వాత చీకట్లో కలసిపోయింది. ఇప్పుడు ఈ కొత్త మూన్ పరిస్థితి కూడా అదేకావచ్చు.