మాస్క్‌ల కంటే.. ఈ ఫేస్ షీల్డ్స్ ఎంతో సేఫ్!.. మీరే సొంతంగా తయారు చేయొచ్చు!

మాస్క్‌ల కంటే.. ఈ ఫేస్ షీల్డ్స్ ఎంతో సేఫ్!.. మీరే సొంతంగా తయారు చేయొచ్చు!

కరోనా వైరస్ నుంచి కేవలం మాస్క్‌లతోనే సురక్షితంగా ఉండాలేమంటున్నారు ప్రముఖ జపనీస్ డిజైనర్ Tokujin Yoshioka. 2020 టోక్యో గేమ్స్ కోసం ఒలింపిక్ ప్లేమ్ క్రియేట్ చేసింది ఈయనే. అల్యూమినియం వ్యర్థాలను రీసైకిల్ చేసి దీన్ని రూపొందించారు. జపానీయులు ఎంతగానో ఇష్టపడే చెర్రీ బ్లూజమ్ ఆకారంలో దీన్ని ఒలింపిక్ ప్లేమ్ తయారుచేశారు.(అన్నంతపని చేసిన ట్రంప్…WHOకు నిధులు ఆపేసిన అమెరికా)

కానీ, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తితో 2020 గేమ్స్ వచ్చే ఏడాది సమ్మర్ వరకు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచుతూ Yoshioka అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కరోనా నుంచి రక్షణకు కేవలం మాస్క్ లు సరిపోవని, ఫేస్ షీల్డ్ మాత్రమే సురక్షితమని చెబుతున్నాడు. Yoshioka స్వయంగా ఓ ఫేస్ షీల్డ్ రూపొందించారు. ఇది అందరూ సులభంగా ధరించవచ్చు.. ఇంట్లోనే తయారుచేయొచ్చు.

ఈ ఫేస్ షీల్డ్ తయారీకి ఆయన గట్టిదైన క్లీయర్ PVC షీట్ వాడారు. దీని ద్వారా కళ్లు, ముక్కు, నోటిని ప్రొటెక్ట్ చేసేలా ఉంది. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిచెందే ప్రధాన ప్రవేశ మార్గాల్లో శ్వాసకోశ వ్యవస్థకు రక్షణ కల్పించేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫ్రీ టెంప్లట్ పూర్తి కొలతలను ఇరువైపులా కలిగి ఉంటుంది. మీ కళ్లుజోడు పెట్టుకునే అలవాటు ఉంటే.. ఈ షీల్డ్ ఎంతో ఈజీగా సెట్ చేసుకోవచ్చు.

దీని తయారీకి కావాల్సిన వస్తువుల్లో పేపర్ టెంప్లట్ ఒకటి తీసుకోండి. ప్లాస్టిక్ షీటు పైభాగంలో పేపర్ టెంప్లట్ ఉంచండి. పేపర్ టెంప్లట్ ఆకృతిలో ప్లాస్టిక్ షీటును కత్తిరించండి. దీనికి మీ కళ్లజోడు ప్రేమ్ అటాచ్ చేయండి. పౌరులు, ఆరోగ్య కార్యకర్తలు తామే సొంతంగా ఈ ఫేస్ షీల్డ్ తయారు చేసుకోవచ్చునని Yoshioka చెబుతున్నాడు. ఎలా తయారు చేయాలో వీడియో ద్వారా కూడా వివరణ ఇచ్చాడు.

కరోనా వైరస్ గాల్లో నీటి బిందువుల ద్వారా ఆరు అడుగుల వరకు ప్రయాణించగలవని చాలామంది నిపుణులు వెల్లడించారు. వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ అన్ని సమయాల్లో తమ ముఖాన్ని కవర్ చేయడం సాధ్యపడే అవకాశం లేదు. అలాగి ప్రజలు కూడా అంతే.. మీరు ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లితే కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ ఫేస్ షీల్డ్ రక్షణగా ఉంటుందని Yoshioka సూచిస్తున్నారు.

ఫేస్ షీల్డ్స్ మన్నికైవని, నీటితో శ్రుభం చేసి తిరిగి వాడొచ్చునని అన్నారు.  ఫేస్ మాస్క్ లకంటే ఈ ఫేస్ షీల్డ్ మాస్క్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మాస్క్ ల కొరత ఏర్పడిన సమయంలో ఇలాంటి స్వయంగా తయారుచేసుకునే ఫేస్ షీల్డ్ ఎంతో ప్రయోజనకరంగానూ రక్షణగానూ ఉంటాయని Yoshioka సూచిస్తున్నారు.