లాక్ డౌన్ లో రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. కారణం ఇదే

స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై హంగామా చేసింది. కరోనాతో జనం బయటకు రావడానికే భయపడుతుంటే, ఆ మహిళ మాత్రం బరితెగించింది. రోడ్డుపైకి వచ్చిన ఒంటిమీదున్న

లాక్ డౌన్ లో రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. కారణం ఇదే

స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై హంగామా చేసింది. కరోనాతో జనం బయటకు రావడానికే భయపడుతుంటే, ఆ మహిళ మాత్రం బరితెగించింది. రోడ్డుపైకి వచ్చిన ఒంటిమీదున్న

స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై హంగామా చేసింది. కరోనాతో జనం బయటకు రావడానికే భయపడుతుంటే, ఆ మహిళ మాత్రం బరితెగించింది. రోడ్డుపైకి వచ్చిన ఒంటిమీదున్న దుస్తులు ఇప్పేసి అందరికి షాక్ ఇచ్చింది. పోలీస్ కారు ఎక్కి ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసింది. దీంతో అంతా అవాక్కయ్యారు. కారుపైన నగ్నంగా నిల్చున్న ఆ మహిళ పెద్ద పెద్దగా అరుస్తూ గెంతులేసింది. ఆ మహిళ తీరు చూసి స్థానికులతో పాటు పోలీసులూ విస్తుపోయారు. ఆ మహిళ ఇలా చేయడానికి కారణం లాక్‌డౌన్ అట. లాక్ డౌన్ ని నిరసిస్తూ ఇలా చేసిందట.

కరోనా వైరస్‌తో భారీగా నష్టపోయిన దేశాల్లో స్పెయిన్ ఒకటి. దీంతో కరోనా కట్టడికి స్పెయిన్ ప్రభుత్వం చాలా రోజులుగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడాన్ని నిరసిస్తూ ఓ మహిళ ఒంటి మీద నూలుపోగు లేకుండా నగ్నంగా వీధుల్లో తిరుగుతూ అందిరికీ షాకిచ్చింది.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడుతున్నానని, దానికి నిరసనగానే నగ్నంగా తిరుగుతున్నట్లు ఆమె చెప్పడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. దీంతో ఆ మహిళ మళ్లీ వీధుల్లోకి వచ్చి బట్టలన్నీ విప్పేసి పోలీస్‌ జీప్ ఎక్కి నినాదాలు చేసింది.

దుస్తులు వేసుకోవాలని ఎంత నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గాయాలపాలైన ఆమెను పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం జైలుకి తరలించారు. వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.

కరోనా కట్టడికి స్పెయిన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రజలు వీధుల్లో తిరగొద్దని, చిన్నారులను బయటకు పంపొద్దని నిబంధనలు విధించింది. ఈ కఠిన నిబంధనల కారణంగా కొందరు మానసిక సమస్యలకు గురై చిత్రంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెప్పారు. కాగా మహిళ నగ్నంగా తిరుగుతున్న దృశ్యాలను కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మహిళ తీరు కొందరికి కోపం తెప్పించింది. మరికొందరికి బాధ కలిగించింది. అయ్యో పాపం అని ఆవేదన వ్యక్తం చేశారు.