సెప్టెంబర్ చివరిలో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్.. సుమారుగా రూ.1000 ఉండొచ్చు?!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍‌ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని, రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ

సెప్టెంబర్ చివరిలో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్.. సుమారుగా రూ.1000 ఉండొచ్చు?!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍‌ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని, రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ, కరోనా వ్యాక్సీన్ 2020లో సెప్టెంబర్ నెలాఖరులో మార్కెట్లోకి అందుబాటులో ఉండొచ్చునని ప్రపంచ అతిపెద్ద వ్యాక్సీన్ మేకర్ చీప్ ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. వ్యాక్సీన్ కు అయ్యే ఖర్చు సుమారుగా రూ.1000 వరకు ఉండొచ్చునని ఆయన అన్నారు.

మే నెలాఖరులోగా వ్యాక్సీన్ మ్యానిఫ్యాక్చరింగ్ మొదలు పెడతామని చెప్పారు. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ సమయానికి ట్రయల్స్ విజయవంతంగా ముగిస్తే.. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చినట్టేనని ఆయన తెలిపారు. అప్పుడే ఈ వ్యాక్సీన్ భారత్ సహా ప్రపంచానికి అందిస్తామని Serum Institute of India చీఫ్ Adar Poonawalla మీడియాకు వివరించారు. ప్రపంచ మహమ్మారిని నిర్మూలించేందుకు పుణె ఆధారిత Serum Institute of India యూకే, యూఎస్‌లోని సైంటిస్టులతో కలిసి కరోనా వ్యాక్సీన్ పై వర్క్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా వైరస్ 3 మిలియన్ల మందికి సోకగా, 209,661 మంది ప్రాణాలు కోల్పోయారు.

చాలామంది సైంటిస్టులు.. రెండేళ్ల కంటే ముందే మార్కెట్లోకి కరోనా వ్యాక్సీన్ వచ్చే అవకాశం లేదని, అలా రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సీన్ ఎలా సాధ్యమని సీరమ్ చీఫ్ Poonawalla అడిగితే ఆయన కూడా ఇదే సమాధనమిచ్చారు. Oxford Universityలోని సైంటిస్టులతో కలిసి వ్యాక్సీన్ కోసం మరికొంత కాలం సమయం పట్టొచ్చునని అన్నారు. Codagenix సహా ఇతర అమెరికా పార్టనర్లతో కలిసి వ్యాక్సీన్ ప్రొడక్షన్ 2021 వరకు పడుతుంది. కానీ, వారం క్రితం జరిగిన చర్చ అనంతరం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతోనూ జతకలిశామన్నారు. అందుకే సాధ్యమవుతుందని చెప్పకొచ్చారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ హ్యుమన్ ట్రయల్స్.. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా ఒకటి ఏప్రిల్ 23న అభివృద్ధి చేయడం ప్రారంభమైంది.

ఇతర ఏడుగురితో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అందులో కొందరు చైనాలో మరికొందరు అమెరికాలో ట్రయల్స్ జరుగుతున్నట్టు ఓ రిపోర్టు నివేదించింది. కరోనా వ్యాక్సీన్ కు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందని Poonawallaను మీడియా అడిగింది. కచ్చితమైన సంఖ్య చెప్పలేమని, కానీ, సుమారుగా రూ.1000 వరకు ఉండే అవకాశం ఉందన్నారు. ఆక్స్ ఫర్డ్ బృందంపై తమకు విశ్వాసం ఉందని సీరమ్ ఇన్సిస్ట్యూట్ చీఫ్ అన్నారు. ఎబోలా వైరస్ వ్యాక్సీన్ కూడా విజయవంతంగా ఇదే బృందం అభివృద్ధిచేశారని అన్నారు. మలేరియా వ్యాక్సీస్ కోసం కూడా తమ సంస్థ ఈ ఆక్స్ ఫర్డ్ బృందంతో జతకట్టిందని తెలిపారు. ఆక్స్ ఫర్డ్ మాత్రమే కాకుండా తమ సంస్థ US సంస్థ Codagenixతో కూడా టై అప్ అయినట్టు వెల్లడించారు.