నోట్రే డామే చర్చి పునర్నిర్మాణం కోసం 7వేల కోట్లు విరాళం

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2019 / 11:33 AM IST
నోట్రే డామే చర్చి పునర్నిర్మాణం కోసం 7వేల కోట్లు విరాళం

సెంట్రల్ ప్యారిస్‌ లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో పైకప్పు నుంచి సోమవారం(ఏప్రిల్-15,2019)పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.దీంతో ఐదేళ్లలోపు చర్చి పునర్నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ వివాదాస్పద స్టేట్ మెంట్ ఇచ్చిన 24 గంటల్లోనే యావత్ ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున చర్చి పునర్నిర్మాణ పనుల కోసం విరాళాలు వచ్చాయి.

యేసు ప్రభు భక్తులు,హై పవర్డ్ మాగ్నెట్స్ అందరూ కలిసి ఇప్పటికే 1బిలియన్ డాలర్లు(6,800కోట్లు) చర్చి పునర్నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు.ఏదేళ్ల సమయంలో కాకుండా వెంటనే చర్చిని పునర్మించాలని కోరుతూ పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. నోట్రే డామే డిజాస్టర్ కి సంబంధించి బుధవారం మేక్రన్ ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించారు. సోమవారం నాటి ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.