China-Taiwan: తైవాన్ చుట్టూ చైనా మరోసారి దుందుడుకు చర్యలు

చాలా కాలంగా తైవాన్ చుట్టూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది చైనా. తైవాన్ ను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది.

China-Taiwan: తైవాన్ చుట్టూ చైనా మరోసారి దుందుడుకు చర్యలు

China-taiwan conflict

China-Taiwan: తైవాన్ విషయంలో చైనా (China) మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 10 చైనా యుద్ధ విమానాలు, 2 నౌకలు తైవాన్ (Taiwan) భూభాగం చుట్టూ కనపడ్డాయి. తైవాన్ జాతీయ రక్షణ శాఖ (MND) నుంచి అందిన వివరాల మేరకు తైవాన్ మీడియా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది.

సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య చైనా యుద్ధ విమానాలు, నౌకలు తిరిగినట్లు తైవాన్ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తైవాన్ పలు చర్యలు తీసుకుంది. ఈ సారి తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను మాత్రం చైనా యుద్ధ విమానాలు, నౌకలు దాటలేదని తైవాన్ మీడియా చెప్పింది.

వారం రోజుల క్రితం కూడా తైవాన్ తమ దేశం చుట్టూ 28 చైనా యుద్ధ విమానాలు, నాలుగు నౌకలు తిరిగినట్లు గుర్తించింది. ఈ నెలలో మొత్తం కలిపి 292 యుద్ధ విమానాలు, 76 నౌకలను పంపింది. 2020 సెప్టెంబరు నుంచి తైవాన్ చుట్టూ చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతూనే ఉంది.

తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగన తల రక్షణ ప్రాంతంలోకి ప్రవేశిస్తూ కలకలం రేపుతున్నాయి. సైనిక, రాజకీయ, ఆర్థిక పరంగా తైవాన్ పై ఒత్తిడి పెంచాలని చైనా కుట్రలు పన్నుతోంది. పైకి తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించేందుకే తాము సైనిక విన్యాసాలు చేపడుతున్నట్లు చైనా చెప్పుకొస్తోంది.

AB InBev India: అంతర్జాతీయ నీటి దినోత్సవంగా నీటి భద్రతా కార్యక్రమాలను విస్తరించనున్న AB InBev India