10 సెకన్ల వీడియో 6.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుబోయింది!

10 సెకన్ల వీడియో 6.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుబోయింది!

10-second video clip sold for 6.6 million dollars : ఒక వీడియో ఖరీదు.. కోట్లల్లో ధర పలికింది.. కొన్ని సెకన్ల వీడియో రికార్డు స్థాయిలో అమ్ముడుబోయింది. అక్టోబర్ 2020లో మయామికి చెందిన ఆర్ట్ కలెక్టర్ పాబ్లో రోడ్రిగెజ్-ఫ్రేలే 10 సెకన్ల వీడియో ఆర్ట్ వర్క్ కోసం దాదాపు, 67వేల డాలర్ల ఖర్చు చేశాడు. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉండే ఈ వీడియోను 6.6 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. ఈ ఆర్ట్ వర్క్ వీడియోను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడవచ్చు. ఈ వీడియోను డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ వీడియో రికార్డు చేశారు. దీని అసలు పేరు మైక్ వింకెల్మన్. డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సర్వీసును అందించే బ్లాక్‌చెయిన్ ఇలాంటి వర్జినల్ ఆర్ట్ వర్క్ లను ధ్రువీకరించేందుకు అనుమతిస్తుంది.

కొత్త రకం డిజిటల్ అసెట్‌గా చెప్పొచ్చు. నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) అని పిలుస్తారు. కరోనా మహమ్మారి సమయంలో బాగా పాపులర్ అయింది. ఆన్‌లైన్‌లో వస్తువులపై భారీగా ఖర్చు పెట్టేందుకు పెట్టుబడిదారులు పోటీపడేంతగా పాపులారిటీ సాధించింది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా పబ్లిక్‌గా ఐటమ్స్‌ను ధ్రువీకరించేందుకు అనుమతిస్తుంది. అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ మొదట బీపుల్ ఆర్ట్‌ను కొన్నాడు.

డిజిటల్ ఆర్ట్ వర్క్ లకు కూడా వర్చువల్ గా భారీ గిరాకీ పెరిగిపోయింది. ఎన్‌ఎఫ్‌టిల మార్కెట్‌, బ్లాక్ చెయిన్ డేటా ప్రకారం.. జనవరిలో 8 మిలియన్ డాలర్ల నుంచి ఫిబ్రవరిలో ఇప్పటివరకు నెలవారీ అమ్మకాల పరిమాణం 86.3 మిలియన్ డాలర్లకు పెరిగింది. నెలవారీ అమ్మకాలు ఏడాది క్రితం 1.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.