Saudi Royals: రూ. 2 వేల కోట్ల విలువైన విమానాన్ని తుక్కు కింద అమ్మేసిన సౌదీ రాజ కుటుంబం

బోయింగ్ 747 విమానం గరిష్ట జీవిత కాలం లక్ష గంటలు కాగా..సౌదీ రాజు కొనుగోలు చేసిన 747-8 విమానం గాల్లో ఎగిరిన సమయం కేవలం 42 గంటలు కావడం విశేషం.

Saudi Royals: రూ. 2 వేల కోట్ల విలువైన విమానాన్ని తుక్కు కింద అమ్మేసిన సౌదీ రాజ కుటుంబం

Saudi

Saudi Royals: ‘రూ. రెండు వేల కోట్లు’.. ఇదీ.. అక్షరాలా ఒక విమానం కొనుగోలు చేసేందుకు సౌదీ రాజకుటుంబం వెచ్చించిన మొత్తం. ప్రపంచంలోనే విలాసవంతమైన విమానంగా చెప్పుకునే టాప్ విమానాల్లో ఇది కూడా ఒకటి. అయితే పట్టుమని పది సార్లు కూడా ప్రయాణించకుండానే ఈ లగ్జరీ విమానాన్ని తుక్కు కింద అమ్మేసింది సౌదీ రాజ కుటుంబం. పూర్తి వివరాల్లోకి వెళితే..సౌదీ అరేబియా దేశంలో ఇంకా రాచరికపు పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ ఇక్కడ సర్వాధికారాలు రాజుకే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నుల రాజకుటుంబాల్లో సౌదీ రాజు కుటుంబం కూడా ఒకటి. ఈక్రమంలో సౌదీ రాజు తన అధికారిక పర్యటనల నిమిత్తం ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఒక పెద్ద విమానాన్ని ఆర్డర్ చేశారు. ‘బోయింగ్ 747-8″గా పిలిచే ఈ విమానం ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ విమానం కూడా.

Also read:PM Modi in Europe: యూరోప్‌లో భారత ప్రధాని: 65 గంటల్లో 25 కీలక సమావేశాల్లో పాల్గొననున్న మోదీ

అయితే 2012కి ముందు ఈ 747-8 విమానాన్ని కొనుగోలు చేసిన అప్పటి సౌదీ రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ తన అభిరుచికి తగ్గట్టుగా తీర్చి దిద్ధించాడు. సుమారు $295 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.2,254 కోట్లుపైమాటే) వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విమానంలో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. అయితే విమానం ఆర్డర్ చేసి డెలివరీ అందుకునేలోపే..రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ 2012లో మృతి చెందారు. రాజు పేరుపైనే ఉన్న ఈ విమానాన్ని ఏం చేయాలో తెలియక రాజు కుటుంబీకులు సైతం పట్టించుకోలేదు. దీంతో ఈ ‘బోయింగ్ 747-8″ 2012 నుంచి స్విట్జర్లాండ్ లోని బాసెల్ నగరంలోనే ఉండిపోయింది. ఇంత భారీ విమానం పదేళ్లుగా ఎవరు వాడకపోవడంతో ఈ విమానాన్ని తిరిగి తామే కొనుగోలు చేసి ఉపయోగించాలని బోయింగ్ సంస్థ భావించింది.

Also Read:AC Power Saving: ఏసీతో కరెంటు బిల్లు పెరిగిపోతోందా: ఇలా ఆదా చేసుకోండి

ఆమేరకు గత నెలలో సౌదీ రాజా కుటుంబం నుంచి తిరిగి విమానాన్ని తుక్కు కింద(స్క్రాప్) కొనుగోలు చేసిన బోయింగ్ సంస్థ..ఏప్రిల్ 15న అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న పీనల్ ఎయిర్‌పార్క్ కి తరలించింది. ప్రపంచంలో పనికిరాని తుక్కు విమానాలను ఇక్కడికే తరలించి..పార్టులుగా విడగొట్టి మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తారు. కాగా బోయింగ్ 747 సిరీస్ లో సంస్థ తయారు చేసిన చివరి విమానం కూడా ఇదే కావడం గమనార్హం. 1970లో మొదటిసారి 747 సిరీస్ విమానాలు తయారు చేయడం ప్రారంభించింది బోయింగ్ సంస్థ.

Also Read:Cooler Facts: వేసవి తాపం చల్లార్చే కూలర్లలో ఇవి తప్పక ఉండాల్సిందే

‘Queen of the Skies’గా పిలిచే ఈ విమానాన్ని అప్పటి అమెరికా అధ్యక్షులు సైతం ఎంతో ఇష్టపడేవారు. విమానాల జీవిత కాలాన్ని అవి గాల్లో ఎగిరిన గంటల వ్యవధిని బట్టి లెక్కిస్తారు. అలా బోయింగ్ 747 విమానం గరిష్ట జీవిత కాలం లక్ష గంటలు కాగా..సౌదీ రాజు కొనుగోలు చేసిన 747-8 విమానం గాల్లో ఎగిరిన సమయం కేవలం 42 గంటలు కావడం విశేషం. అది కూడా విమానంలో నగిషీలు ఏర్పాటు కోసం స్విట్జర్లాండ్ కు తరలించడంతో లెక్కలోకి వచ్చిన సమయం.