Four Working Days : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి నాలుగురోజులే పనిదినాలు

యూకేలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాయి. ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురు చెప్పాయి.

Four Working Days : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి నాలుగురోజులే పనిదినాలు

four working days

Four working days : యూకేలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాయి. ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురు చెప్పాయి. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పని చేస్తున్నారు. 4డే వీక్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ మేరకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్‌ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అవిన్‌ సైతం ఈ జాబితాలో ఉండటం విశేషం.

UAE good news: UAEలో ఇక నాలుగున్నర రోజులే పనిదినాలు!

అయితే ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు. కొత్త పాలసీతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించామని తెలిపారు. ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదని చెప్పారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదన్నారు.

తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగుల వలసలను సైతం ఇది అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కాగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిలకు చెందిన పరిశోధకులు.. సుమారు 3,300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నారు.