Halala kanda Mansion : అడవిలో 100 ఏళ్లనాటి చారిత్రాత్మక బంగ్లా..రిచ్ రిసార్ట్ గా మారిన అలనాటి భవనం

దట్టమైన అందమైన అడవిలో 100 సంవత్సరాల నాటి బంగ్లా.ఓ శ్రీమంతుడు భార్య గుర్తుగా కట్టుకున్న ఆ బంగ్లా గత చరిత్రగా మిగిలిపోలేదు. నేడు అత్యద్భుతమైన ఆధునికతతో మరింత అందంగా..రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుని గత చరిత్రకు..నేటి ఆదునికతకు నిదర్శనంగా ఆకట్టుకుంటోంది.

10TV Telugu News

100 Year Old Halala kanda Mansion : అది దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో గతకాలపు చారిత్రక ఆనవాళ్లను చాటిచెప్పేలా నిలబడిన అత్యద్భుతమైన బంగ్లా. ఒకప్పుడు అత్యంత సంపన్నులు విడిదిగా విరాజిల్లిన ఆ విలాసవంతమైన ఆ బంగ్లా కళ తప్పింది. కానీ కన్నుచెదిరే అందాలను మాత్రం కోల్పోలేదు. గత చరిత్రను చాటి చెబుతూనే..నేటి అత్యాధునిక హంగులతో కొత్తగా మెరిసిపోతోంది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యద్భుతమైన కట్టటంగా నిలిచిన బంగ్లా.ఆనాటి వైభవానికి…ఈనాటి ఆధునికతకు నిలువెత్తు రూపంగా కనువిందు చేస్తూ రా రమ్మని పిలుస్తోంది. అడవి అందాలే కాదు..నా వైభవాన్ని కూడా చూడండీ అంటూ పిలుస్తోంది శ్రీలంకలోని ఈ చారిత్రాత్మక బంగ్లా. ఆనాటి సంస్కృతికి ఈనాటి ఆధునికతకు అద్ధపడుతోంది శ్రీలంకలోని ‘హ‌లాలా కండా’ బంగ్లా.

1912 కాలంలో ఓ శ్రీమంతుడు తన భార్య గుర్తుగా ఆ బంగ్లాని నిర్మించాడు. శ్రీలంక‌లోని వెలిగామ ప‌ట్టణానికి స‌మీపంలో ఈ అద్భుతమైన భవంతికి ‘హ‌లాలా కండా’ అనే పేరు పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ బంగ్లా ఎంతో మంది ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియన్ చక్రవర్తి హేలీ సెల‌స్సీ, అలనాటి ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ కేథ్ మిల్లర్ వంటి ప్రముఖులు ఈ బంగ్లాలో విడిది చేసేవారు. కానీ రోజులు గడేచే కొద్ది ఆ బంగ్లా వైభ‌వం త‌గ్గిపోయింది. ఎవ్వరూ విడిదికి రాకపోవటంతో కళ తప్పింది. చివరకు ఆ అందమైన అడవిలో ఓ వెలుగు వెలిగిన ఈ అద్భుతమైన బంగ్లా శిధిలమైన భవనంలా మిగిలిపోయింది. రాతి గోడలు కూలిపోయి.. గ‌బ్బిలాల‌కు ఆవాసంగా మారిపోయింది. ఖాళీగా ఉండే బంగ్లాలో నిశాచరి ప్రాణులు గూడు కట్టుకున్నాయి. దాదాపు దెయ్యాల కొంపలా మారిపోయింది. కానీ ఏనాటికైనా నాకు పూర్వ వైభం రాకపోతుందా? అని ఆ బంగ్లా ఎదురు చూపులకు ఫలితం దక్కింది.

ఇక ఎందుకు పనికి రాదని అనుకున్న ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భ‌వ‌నాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు నలుగురు స్నేహితులు. గత చరిత్రతో పాటు ఈనాటి ఆధునికతను జత చేసి అత్యద్భుతమైన భవనంగా తీర్చిదిద్దారు హ‌లాలా కండాను కొన్న స్నేహితులు.నలుగురు స్నేహితులు 2011లో ఈ భవనాన్ని రూ.2కోట్లుకు కొన్నారు. దాని మరింత అందంగా తీర్చి దిద్దారు. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అయిన‌ శార్ప్, అత‌ని స్నేహితులు జెన్నీ లెవిస్‌, రిచ‌ర్డ్ బ్లీస్‌డేల్‌, బెంట్లీ డి బేయ‌ర్‌ ఆ బంగ్లాను పునర్నిర్మాణం చేసి బంగ్లాకు పున‌ర్వైభ‌వం తీసుకొచ్చారు. ఎన్నో స‌వాళ్లను ఎదుర్కొని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 2011కలో కొని 2012 డిసెంబ‌ర్‌లో ఆ బంగ్లా పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను మొద‌లు పెట్టారు. అలా రెండేళ్లు కష్టపడి చారిత్రాత్మక‌త దెబ్బతిన‌కుండా ఇప్పటి అధునాత‌న సౌక‌ర్యాలు ఉండేలా ఆ భవనాన్ని పూర్తి చేశారు.

అంత అందమైన భవానికి మరింత వన్నె తెచ్చేలాగా గార్డెన్‌లో 23 మీట‌ర్ల పొడ‌వుతో ఒక నీటి కొల‌నును ఏర్పాటు చేశారు. ఈ పూల్ లో భవనం ప్రతిబింభం కనిపించి కనువిందు చేస్తోంది. ఆ పాత బంగ్లాను న‌లుగురు స్నేహితులు రిసార్ట్‌గా మార్చేశారు. ఐదు బెడ్రూంల‌తో అందంగా ఆకట్టుకునేలా తయారు చేశారు. దీంట్లో 12 మంది విడిది చేయవచ్చు. వారి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక మేనేజ‌ర్‌ తో పాటు ఓ చెఫ్‌, ఇద్ద‌రు స‌ర్వీస్‌ స్టాఫ్‌, ఇద్ద‌రు గార్డెన‌ర్లు, ఒక సెక్యూరిటీ గార్డు ని ఏర్పాటు చేశారు. ఈ చారిత్రాత్మక రిసార్ట్‌లో ఒక రాత్రి ఉండాలంటే దాదాపు రూ. ల‌క్ష (1300 డాల‌ర్లు) చెల్లించాలి. శ్రీలంక వెళితే చరిత్రతో పాటు ఆధునికత మేళవింపులతో కనువిందు చేసే ఈ ‘హ‌లాలా కండా’ను ఒక్కసారి చూసి రండీ..ఆ అనుభూతే వేరు అని ఫీలవుతారనటంలో ఎటువంటి సందేహం లేదు..

10TV Telugu News