Solar Powered Car : ఒక్కసారి చార్జి చేస్తే..1,000 కిలోమీటర్లు దూసుకుపోయే ‘సోలార్ కారు’ తయారు చేసిన విద్యార్ధులు

పెట్రోల్‌ ఖర్చుల్లేకుండా.. కరెంటు బిల్లులు రాకుండా, బ్యాటరీ ఖర్చు కూడా లేకుండా ..1000 కిలోమీటర్లు..కారు రయ్ మంటూ దూసుకుపోయే కారును తయారు చేశారు ఆస్ట్రేలియా విద్యార్ధులు..అదే ‘సోలార్ కారు’..!

Solar Powered Car : ఒక్కసారి చార్జి చేస్తే..1,000 కిలోమీటర్లు దూసుకుపోయే ‘సోలార్ కారు’ తయారు చేసిన విద్యార్ధులు

1,000 Km In Single Charge Car..

Solar Powered Car : పెట్రోల్‌ ఖర్చుల్లేకుండా.. కరెంటు బిల్లులు రాకుండా, బ్యాటరీ ఖర్చు కూడా లేకుండా ..1000 కిలోమీటర్లు..కారు రయ్ మంటూ దూసుకుపోయే కారును తయారు చేశారు ఆస్ట్రేలియా విద్యార్ధులు..అదే ‘సోలార్ కారు’..! రూ. 100పైనే.. ఉంది లీటర్ పెట్రోల్. ఇంకా పెరగొచ్చు..పెరగకపోవచ్చు. కానీ పెట్రోల్ తో పనిలేదు ఈ సూపర్ కారుకు. పెట్రోల్‌కి ఆల్టర్‌నేట్‌గా ఎలక్ట్రిక్‌ ఎనర్జీ వచ్చినా… ఇప్పుడిప్పుడే ఈ కార్స్‌, ఈ బైక్స్‌ మార్కెల్‌లోకి అడుగుపెడుతున్నాయ్‌. కానీ.. సుదూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం కుదరదు. ఏదో.. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి.. గంటలకొద్దీ చార్జింగ్‌ పెడితే.. వందో.. రెండొందల కిలోమీటర్లో వెళ్లొచ్చు. అయితే విద్యుత్‌ చార్జీలు కూడా షాక్‌ కొట్టేస్తున్నాయి మరి!! ఇక.. వీటి నుంచి బయటపడడమెలా? అసలు ఖర్చు లేకుండా ప్రయాణం చేసే వీలుంటే సూపర్‌ కదూ!! సరిగ్గా అదే ఆలోచనను నిజం చేసి చూపించారు స్టూడెంట్స్‌. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో అద్భుతాన్ని సృష్టించారు.

పెట్రోల్‌ లేకుండా.. కరెంటు వాడకుండా.. ఏకంగా వెయ్యి కిలోమీటర్లు రయ్యిమని దూసుకెళ్లే సూపర్‌ సోలార్‌ కారును ఆవిష్కరించారు ఆస్ట్రేలియన్‌ వర్సిటీ స్టూడెంట్స్‌. ఒక్కసారి బ్యాటరీ చార్జి అయితే చాలు.. ఏకంగా వెయ్యి కిలోమీటర్లు.. అది కూడా దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్‌ చేశారు.. ప్రపంచం ఆశ్చర్యపోయే అద్భుతమైన సోలార్‌ కారును రూపొందించారు యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ స్టూడెంట్స్‌. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో పెను సంచలనమే నమోదు చేశారు. సోలార్‌ ఎనర్జీతో నడిచే కార్లపై ఇప్పుడిప్పుడే ప్రయోగాలు జరుగుతున్న వేళ.. ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేలా సూపర్‌ సోలార్‌ కారు సన్‌స్విఫ్ట్‌ -7 ని ఆవిష్కరించారు.

సోలార్‌ పవర్‌తో నడిచే ఈ కారు బ్యాటరీ ఒక్కసారి చార్జి చేస్తే ఏకంగా వెయ్యి కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఇటీవల టెస్ట్ రైడ్‌లో సుమారు 85 కిలోమీటర్ల వేగంతో 12 గంటల పాటు ప్రయాణించి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అందుకుని అబ్బురపరిచింది సన్‌స్విఫ్ట్‌ -7. ఆటోమొబైల్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్లో సోలార్‌ ఎనర్జీ వెహికల్సే ఓ సంచలనం. అందులోనూ సుదూర ప్రాంతాలు ప్రయాణించే కార్‌ను రూపొందించడం నిజంగా అద్భుతమే. సుమారు రెండేళ్లుగా ఈ కారు కోసం శ్రమించిన యాభై మంది స్టూడెంట్స్‌.. తమ సన్‌ స్విఫ్ట్ కారును ఎట్టకేలకు టెస్ట్ రైడ్‌ చేసి.. అద్భుతాన్ని ఆవిష్కరించారు. 85 కిలోమీటర్ల వేగంతో.. 11 గంటల 53 నిమిషాల 36 సెకండ్లలో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిందీ సోలార్‌ కారు.

ఇప్పటి వరకూ తయారైన సోలార్‌ కార్లలో ఇదే ది బెస్ట్‌. గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ ఖాయమని అంతా ఫిక్సైపోయారు. గిన్నిస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడమే నెక్ట్స్‌ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. సోలార్‌ కారు సక్సెస్‌తో స్టూడెంట్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన స్టూడెంట్స్‌ని చూసి గర్వపడుతున్నానంటున్నారు వర్సిటీ ప్రొఫెసర్‌.. ప్రోగ్రామ్‌ ప్రిన్సిపల్‌ రిచర్డ్ హాప్‌కిన్స్‌. తాము కేవలం సలహాలు మాత్రమే ఇచ్చామని.. విద్యార్థులే అద్భుతాన్ని సృష్టించారని తెగ మురిసిపోతున్నారాయన. ఈ కారు తయారు చేయాలనుకున్నప్పుడే వరుసగా షట్‌ డౌన్‌లు పడిపోయాయి. అయినా.. వెనక్కి తగ్గని విద్యార్థులు.. రెండేళ్లు శ్రమించి ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని చేసి చూపించారు.