102-year-old man : 102 ఏళ్ల వృద్ధుడు ఫ్లవర్ బొకే ఇచ్చాడు.. ప్రేయసికి కాదు..
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.

102-year-old man
102-year-old man : 102 ఏళ్ల వయసంటే ఓ పెద్దాయన జీవితంలో ఎన్నో చూసి ఉంటాడు. ఇన్ని సంవత్సరాల లైఫ్ జర్నీలో తన వెన్నంటే ఉన్న భార్య ఆసుపత్రిలో ఉంటే ఆమెకు తిరిగి ఏమివ్వగలడు. భార్యకు అందమైన పూల గుత్తి ఇచ్చి ప్రేమను చాటుకున్నాడు. అందరి మనసుల్ని దోచుకున్నాడు.
పెళ్లి సమయంలో నిండు నూరేళ్లు జీవించండి అని ఆశీర్వదిస్తారు. నిజానికి ఈ కాలంలో అలా కలిసి జీవించే జంటలు అరుదుగా కనిపిస్తున్నాయి. అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక పెళ్లి అనే బంధం పట్ల ఈ కాలం యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనసుని హత్తుకుంటాయి.
102 సంవత్సరాల వృద్ధుడి భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అన్ని సంవత్సరాలు తన జీవితంలో వెన్నంటి ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకున్న భార్యకు అతను ఏమిచ్చి రుణం తీర్చుకుంటాడు. అందమైన ఫ్లవర్ బొకేతో ఆసుపత్రికి వచ్చాడు. భార్యకు ఎంతో ఆప్యాయంగా అది అందించి ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని @GoodNewsMVT అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే క్షణాల్లో ఇది వైరల్ అయ్యింది.
Old Man Dance Goes Viral : మనవడి పెళ్లిలో 96 ఏళ్ల వృద్ధుడు చేసిన డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెడతారు
‘102 ఏళ్ల భర్త తన జీవితకాలపు ప్రేమకు పువ్వులు ఇచ్చాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియోకు చాలామంది నెటిజన్లు స్పందించారు. రీసెంట్‌గా ఇలాంటిదే ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఇండియన్ ఐడల్ రన్నరప్ రాకేష్ మైనీ తను ట్రైన్ జర్నీలో చూసిన ఓ ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు ఆహారం తినిపించడం, టాయిలెట్‌కి తీసుకెళ్లడం, నిద్రపుచ్చడం చేసిన ఓ పెద్దాయన వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. ఇలాంటి సన్నివేశాల్ని చూస్తుంటే ప్రేమంటే ఇదేరా అనిపిస్తుంది. కనీసం ఇలాంటి జంటల్ని చూసైనా ఇప్పటితరం వారు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలేమో.
102-year-old husband brings flowers to the love of his life who is in the hospital. 👴🏼💐👵🏼 pic.twitter.com/fTx4DSeXLy
— GoodNewsMovement (@GoodNewsMVT) May 4, 2023