ఉమ్మడి కుటుంబం.. ఉమ్మడి భార్య.. నేపాలీల వింత ఆచారం

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 08:07 AM IST
ఉమ్మడి కుటుంబం.. ఉమ్మడి భార్య.. నేపాలీల వింత ఆచారం

తాషి సంగ్మో అనే వ్యక్తికి 17ఏళ్లకే ఇంటి పక్కన ఉండే 14ఏళ్ల బాలికతో వివాహమైంది. నేపాల్ లోని హిమాలయ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి సమయంలోనే పెళ్లి కొడుకు సోదరుడిని కూడా వివాహం చేసుకుంటానని బాలిక మాటిచ్చింది. పురాతన కాలం నుంచి డొల్ఫా ప్రాంతంలోని ప్రతి కుటుంబం  వారి కొడుకులకు ఒకే మహిళతో వివాహం జరిపిస్తూ వస్తున్నారు. రోజులు మారుతున్న కొద్దీ కల్చర్ మార్చుకుంటూ వారు కూడా మోడరన్ లైఫ్‌కు అలవాటుపడుతున్నారు. 

‘మేమంతా ఉమ్మడి కుటుంబంలా ఉంటుండటంతో పెద్ద సమస్యగా అనిపించదు. ఈ సంప్రదాయం కారణంగా భార్యలు ఎక్కువ మంది వచ్చి మమ్మల్నివిడదీయలేరు. ఇద్దరు సోదరులం సంపాదిస్తుంటే ఆమె ఒక్కత్తే కుటుంబం పనులు చూసుకుంటుంది. 

సంగ్మో.. మింగ్మార్ లామాను 14ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆ సమయంనే అతని సోదరుడు పసంగ్ వయస్సు 11 కొద్ది కాలం తర్వాత ఆమె అతనితోనూ వైవాహిక బంధాన్ని పంచుకుంది. ఈ సంప్రదాయం హిమాలయ గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుంది. వారి ఇద్దరికీ ఇప్పుడూ 8ఏళ్లు, 6ఏళ్లు, 4ఏళ్లు వయస్సున్న కొడుకులున్నారు. 

‘ఈ బంధాన్ని నా సోదరుడితో పంచుకోవాలని ఉంది. దాంతో ఇద్దరికి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. నేపల్-టిబెట్ మార్గంలో వీరి జీవనం సాగుతుంది. డొల్ఫా ఫైన ప్రాంతంలో ఉన్న వారికి ఇక్కడే సంపాదన. టిబెట్ నుంచి ఉప్పు, టెర్రాయ్ ప్రాంతాల నుంచి బియ్యం తెచ్చుకుని బతుకుతారు. 

Also Read | క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం

పెళ్లిళ్లు నిర్ణయించేటప్పుడే పెద్ద కొడుక్కి సంబంధం మాట్లాడే సమయంలోనే మిగిలిన కొడుకులు పెద్ద వారయ్యాక వారితోనూ అదే బంధం కొనసాగించాలని ఒప్పందం చేసుకుంటారు. కొందరైతే తమ భవిష్యత్ భర్తల నుంచి సెక్స్  పొందడానికి ఎదురుచూస్తూ ఉంటారట. కొన్ని కుటుంబాల్లో మహిళలు సంపాదిస్తుంటే భర్తలు ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ చూసుకుంటారట. 

శితార్ దొర్జె (30) పదేళ్ల క్రితం కర్మ(37)ను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల తర్వాత బుద్ధిస్ట్ ఫిలాసఫీ చదువుకున్న తన సోదరుడు వారి వివాహబంధంలో భాగమయ్యాడు. ‘మేమంతా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మా అన్న నా భార్య కలిసి ఒకే గిలో ఉంటారు. నాకు అప్పుడు ఎలాంటి అసూయ ఉండదు. చెడ్డగానూ అనుకోను. నాకు నచ్చకపోతే ఇక్కడే ఉండాలనేముంది వేరే పెళ్లి చేసుకుంటా’ అని చిన్నవాడైన పేమా అంటున్నాడు. 

వారిలో ఒక భర్త చనిపోయినా మిగిలిన వారు చూసుకుంటారనే నమ్మకంతో ఉంటారట. ఏదైనా ఇంటి నుంచి వియ్యం అందుకునే సమయంలో ఎక్కువ మంది కొడుకులు ఉన్న ఇంటికి ఇవ్వడానికే ఆసక్తి చూపిస్తారట. ఆ ప్రాంతంలో మొత్తం 48మంది పురుషులు ఉండగా 46మంది స్త్రీలు ఉన్నారు.