Facebook, Google ఉద్యోగులకు సంవత్సరం చివరి వరకూ Work from Home

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 02:04 PM IST
Facebook, Google ఉద్యోగులకు సంవత్సరం చివరి వరకూ Work from Home

టెక్ దిగ్గజాలు Facebook, Google తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయనుంది. 2020 సంవత్సరం చివరి వరకూ ఆఫీసులకు పిలిచే అవకాశం కనిపించట్లేదు. ఇవే కాదు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ కల్చర్‌కు అనుమతులు ఇచ్చేశాయి. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం.. ఫేస్‌బుక్ జులై 6వరకూ ఆఫీసు ఓపెన్ చేయాలనుకోలేదు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ వస్తున్న రెస్పాన్స్ బట్టి దీనినే సంవత్సరాంతం కొనసాగించాలనుకుంటోంది. 

ఆ తర్వాతైనా ఆఫీసుల నుంచి వర్క్ చేసే వారెవరో ఇంకా నిర్ణయించలేదు. పబ్లిక్ హెల్త్ డేటా, గవర్నమెంట్ గైడెన్స్, స్థానిక అవసరాలను బట్టి ఆఫీసులను రీ ఓపెన్ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాయి. ఏప్రిల్ నెలలో ఫేస్‌బుక్ తన మేజర్ ఫిజికల్ ఈవెంట్లన్నింటినీ 2021 వరకూ క్యాన్సిల్ చేసుకుంది. 

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఆఫీసులకు వచ్చే ప్లాన్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కంటెంట్ రివ్యూవర్స్, కౌంటర్ టెర్రరిజం, సూసైడ్, స్వయంగా హాని చేసుకుని ఫేస్ బుక్ లో పోస్టు చేసేవారిపై నిఘా ఉంచేవారు, ఇంజినీర్లు, కాంప్లెక్స్ హార్డ్ వేర్ వారు త్వరలోనే ఆఫీసులకు అటెండ్ అవుతారని చెప్పారు. 

గూగుల్ కూడా అదే స్టైల్ వాడనుంది. 2020 మొత్తం తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేసుకోవచ్చని సూచించింది. ఈ సమయంలో ఇంటి నుంచి పనులు చేసుకునేవారికి ఫుడ్, ఫిట్‌నెస్, హోం ఫర్నీచర్, డెకరేషన్, గిఫ్టుల వంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వమని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. 

ఆఫీసులో లేనప్పుడు ఉద్యోగులు చేసే ఖర్చులు తమ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. గత నెల సుందర్ పిచాయ్ ఓ ఈ మెయిల్ లో ఆల్ఫాబెట్, గూగుల్ లో ఉద్యోగుల నియామకాలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని పేర్కొన్నారు.