ఈజిప్ట్ నూతిలో 2500 ఏళ్లనాటి 27 మమ్మీలు

  • Published By: sreehari ,Published On : September 21, 2020 / 01:57 PM IST
ఈజిప్ట్ నూతిలో 2500 ఏళ్లనాటి 27 మమ్మీలు

Egyptian mummy: ఈజిప్ట్ చరిత్ర ఓ బ్రహ్మాండం. తెలిసినట్లే ఉంటుంది చాలా రహస్యాలు అలాగే మిగిలిపోతాయి. మూడువేల ఏళ్ల క్రితం అంతెత్తున పరిమిడ్‌లను కట్టిన చక్రవర్తులు తమ దేహాలను పరిరక్షించుకోవడం కోసం దాచుకున్నారు. దొంగలకు దొరక్కుండా ఎక్కడెక్కడో దాచారు. వాళ్లతోపాటు ఈజిప్ట్ రహస్యమూ దాగిపోయింది.

మరి వాళ్లెవరు? చక్రవర్తులా? లేదంటే ధనవంతులా? ఇంకా రహస్యంగానే ఉంది.

ఈ చక్క శవపేటికలు Egypt రాజధాని Cairoలోని పవిత్రమైన Saqqaraలో బావిలో దొరికాయి.

The United Nations Educational, Scientific and Cultural Organisation (UNESCO) ,Saqqaraని World Heritage Siteగా ప్రకటించింది. ఇది మూడువేల ఏళ్లుగా ఈజిప్ట్ చక్రవర్తులకు స్మశానవాటిక అని బిబిసి అంటోంది.

36 అడుగుల మేర తవ్వితే, పాడైపోతున్న స్థితిలో ఈ మమ్మీలు దొరికాయి. వాటి ఫోటోలు, వాటితోపాటు దొరికిన సామాగ్రిని జనం ముందుకు తీసుకొచ్చారు.

ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో కలప, గ్రానైట్‌తో చేసిన శవపేటికల్లో ఆనాటి గొప్పవాళ్ల దేహాలను ఖననం చేసేవాళ్లు. గ్రీసు, రోమ్‌లోనూ ఇదే ప్రాచీన సంప్రదాయముంది.