ఫ్లోరిడా తీరంలో ప్రత్యక్షం : 11 అడుగుల భారీ కొండ చిలువ 

  • Published By: sreehari ,Published On : October 2, 2019 / 01:16 PM IST
ఫ్లోరిడా తీరంలో ప్రత్యక్షం : 11 అడుగుల భారీ కొండ చిలువ 

అదో భారీ కొండ చిలువ. పేరు బర్మసే.. 11 అడుగుల పొడవు ఉంటుంది. ఫ్లోరిడాలోని బిస్కేయిన్ తీర ప్రాంతంలో నడి సముద్రంలో ఈదుతూ కనిపించింది. ఎటు వెళ్లాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతోంది. ఇంతలో అదే మార్గంలో జీవ శాస్త్రజ్ఞలు కొండ చిలువను గుర్తించారు. వల సాయంతో 14 కిలోల కొండ చిలువను బోటులోకి ఎక్కించారు. తీర ప్రాంతానికి ఒక మైలు లేదా 1.6 కిలోమీటర్ల దూరంలో కొండ చిలువను బయోలాజిస్టులు పట్టుకున్నారు. బర్మసే కొండ చిలువను ఒడ్డుకు తీసుకొచ్చిన అనంతరం దాని పొడవు ఎంత ఉందో కొలిచారు. 

11 అడుగుల పొడవు.. 14 కిలోల బరువు ఉన్నట్టు నిర్ధారించారు. ఆ తర్వాత బిస్కేయిన్ నేషనల్ పార్క్ తమ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్లో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోకు 23వేల వ్యూస్ రాగా.. వందలాది కామెంట్లు వచ్చాయి. బిస్కేయిన్ సముద్ర తీరంలో కొండ చిలువలు దండెత్తి పోవడం చాలా అరుదుగా జరుగుతుంటుందని బిస్కేయిన్ నేషనల్ పార్కు ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. అందుకే ఇలాంటి పాములు కనిపించినప్పుడు జాగ్రత్తగా గుర్తించి వాటిని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్నట్టు పేర్కొంది. ఎవర్ గ్లేడ్స్ లో బర్మసే కొండ చిలువలు సంచరించడం చాలా కామన్. 1980 తర్వాత నుంచి వీటి జాతి క్రమంగా విచ్చిన్నమై పోయింది. ఈ జాతి కొండ చిలువలను పెంచుకునే వారంతా వాటిని సంరక్షణ తీసుకోలేక అడవిలో విడిచిపెట్టడంతో ఫ్లోరిడాలో వీటి సంచారం పెరిగిపోయింది.