Natasha Peri : 11 ఏళ్ల బాలిక..ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్ధినిగా అవార్డు

11 ఏళ్ల పసిప్రాయం అంటే అమ్మతో ఆటలు..నాన్నతో షికార్లు. తోటి పిల్లలతో ఆటలు ఇవే ఆ వయస్సు పిల్లలు చేసేవి. కానీ ఓ 11 చిన్నారి మాత్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి లిస్టులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో భారత సంతతికి చెందిన ‘నటాషా పెరి’ అనే 11 ఏళ్ల భారత సంతతికి చెందిన బాలిక అత్యుత్తమ తెలివైన విద్యార్ధుల్లో ఒకరని అమెరికాలోని అత్యున్నత యూనివర్సిటీ అయిన జాన్స్ హాప్కిన్స్ స్వయంగా ప్రకటించింది.

Natasha Peri : 11 ఏళ్ల బాలిక..ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్ధినిగా అవార్డు

Natasha Peri

Indian American Girl Natasha Peri : 11 ఏళ్ల పసిప్రాయం అంటే అమ్మతో ఆటలు..నాన్నతో షికార్లు. తోటి పిల్లలతో ఆటలు ఇవే ఆ వయస్సు పిల్లలు చేసేవి. కానీ ఓ 11 చిన్నారి మాత్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి లిస్టులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో భారత సంతతికి చెందిన ‘నటాషా పెరి’ అనే 11 ఏళ్ల బాలిక అత్యుత్తమ తెలివైన విద్యార్ధుల్లో ఒకరని అమెరికాలోని అత్యున్నత యూనివర్సిటీ అయిన జాన్స్ హాప్కిన్స్ స్వయంగా ప్రకటించింది.

భారత సంతతికి చెందిన నటాషా పెరి న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్మియర్ ఎలిమెంటరీ స్కూల్ లో గ్రేడ్ 5 (5th calss)చదువుతోంది.నటాషా ఇటీవల ఒక టాలెంట్ టెస్టులో పాల్గొంది. జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించే ట్యాలెంట్ సెర్చ్ లో నటాషా పాల్గొంది.2021 మార్చి లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84దేశాల నుంచి 19,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ 2020-2021 కి గాను గత మార్చి లో జరిగాయి. సీటీవై నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (యాక్ట్)లో పాల్గొన్న నటాషా చక్కటి ప్రతిభ కనబరిచింది.అమెరికాలో కాలేజీల ఎంట్రీ కోసం ఈ పరీక్షలను ప్రామాణికంగా తీసుకునే ఈ పరీక్షల్లో నటాషా అడ్వాన్స్ డ్ గ్రేడ్ 8కు నిర్వహించే పరీక్షలకు సరిసమానంగా ఆమె మార్కులు తెచ్చుకుంది. 90 శాతం పర్సంటైల్ ను సాధించింది. దీంతో ఆమెను సీటీవై ‘హై ఆనర్స్ అవార్డ్స్’కు ఎంపిక చేసింది.

ఇంతటి ప్రతిభ కనబరిచిన నటాషా ఆనందం వ్యక్తంచేస్తూ..ఈ పరీక్షలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని..భవిష్యత్ లో మరిన్ని సాధిస్తానని నటాషా ధీమా వ్యక్తం చేసింది. తాను ఎక్కువగా డూడ్లింగ్, జెఆర్ఆర్ టోల్కీన్ నవలలు చదువుతానని..అవి తనకు చాలా ఉపయోగపడ్డాయని తెలిపింది.కాగా అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా వీరిలో భారత సంతతికి చెందిన నటాషా కూడా ఒకమ్మాయి. నటాషా గురించి ఆమె ప్రతిభ గురించి..ఇతర విద్యార్దుల గురించి సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్జీనియా రోచ్ మాట్లాడుతూ..పిల్లల్లో నేర్చుకోవాలనే బాగా ఉందని ఇది వారి భవిష్యత్తుగా చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇంత చిన్న వయస్సులోనే పిల్లల్లో ఇటువంటి ఆసక్తి ఉండటం ఏదైనా సాధించాలనే వారి పట్టుదల చాలా ముచ్చటగా ఉందన్నారు. వారి స్కూల్, కాలేజ్, ఉన్నత చదువుల్లో మరింతగా ఎదిగటానికి మా సహకారం అందిస్తామని తెలిపారు.

కాగా అత్యంత కష్టమైన ఈ పోటీ పరీక్షలో అతి తక్కువ మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ నటాషా క్వాలిఫై కావడమే కాదు..టాపర్ గా నిలవటం విశేషం. జాన్ హాప్‌కిన్స్ విద్యావేత్తలు సైతం నటాషా పెరీ ప్రతిభకు మంత్రముగ్దులయ్యారు. అనంతరం నటాషాకు “హై హానర్స్ అవార్డ్స్” అవార్డు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

11 Year Old Indian American Girl Is One Of The Brightest In The World