South Africa: దక్షిణాఫ్రికాలోని బార్‌లో కాల్పులు.. 14 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత‌ కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న స‌మ‌యానికి 12మంది మరణించినట్లు గుర్తించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

South Africa: దక్షిణాఫ్రికాలోని బార్‌లో కాల్పులు.. 14 మంది మృతి

South Africa

South Africa: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత‌ కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న స‌మ‌యానికి 12మంది మరణించినట్లు గుర్తించారు. మ‌రో 11 మందికి గాయాలుకాగా.. వారిని చికిత్స నిమిత్తం క్రిస్ హ‌నీ బ‌ర‌గ్వానాథ్ ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటన సోవెటో టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది.

Rachakonda : మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్ఐ పై రేప్ కేస్… సస్పెండ్ చేసిన సీపీ

ఆదివారం తెల్ల‌వారు జామున స‌మ‌యంలో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మృతదేహాల‌ను గుర్తించారు. కాల్పులకు దారితీసిన విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. శనివారం అర్థరాత్రి మినీబస్ ట్యాక్సీలో వచ్చిన కొంతమంది వ్యక్తులు బార్‌లోని కొంతమంది వ్య‌క్తుల‌పై కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కాల్పుల్లో మ‌ర‌ణించిన, గాయ‌ప‌డ్డ వ్యక్తులు లైసెన్స్ పొందిన బార్‌లో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా వారికి కొన్ని కాల్పుల‌ శబ్దాలు వినిపించ‌డంతో వారు వెంట‌నే బార్ లోనుంచి బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించారు. దీంతో దుండ‌గులు వారిపై కాల్పులు జ‌రిపారు.

ప‌న‌స గింజ‌ల్లో అనేక‌ ఔష‌ద గుణాలు ..

ఈస్ట్ లండన్ నగరంలోని ఒక బార్‌లో 21 మంది యువకులు చనిపోయిన రెండు వారాల తర్వాత సోవెటో బార్‌లో కాల్పులు జరిగాయి. ఆ మరణాలకు కారణాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. ప్ర‌స్తుతం కాల్పులు జ‌రిగిన ప్రాంతం.. సోవెటోలోని ఓర్లాండో జిల్లాలో ఉంది. ఇది జోహన్నెస్‌బర్గ్‌లోని అతిపెద్ద టౌన్‌షిప్, రాజధానికి నైరుతి దిశలో ఉంది.