ఆరు గంటల పాటు :120 భాషల్లో పాటలు పాడిన 14 ఏళ్ల బాలిక

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 09:46 AM IST
ఆరు గంటల పాటు :120 భాషల్లో పాటలు పాడిన 14 ఏళ్ల బాలిక

120 భాషల్లో పాటలు పాడిన 14 ఏళ్ల సుచేత సతీష్ ‘గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డు-2020’ని అందుకుంది. దుబాయ్ ఇండియన్ హై స్కూల్ నైటింగేల్ అని పిలువబడే సుచేత భారతీయ మూలాలు కలిగిన అమ్మాయి.

ఈ సందర్భంగా సుచేత తండ్రి టీసీ సతీష్ మాట్లాడుతూ తమ కుమార్తె దుబాయ్ ఇండియన్ హైస్కూల్‌లో గాన కోకిలగా గుర్తింపు పొందిందన్నారు. డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, యాక్టంగ్,  స్పోర్ట్ అన్నింటిలో కూడా సుచేతకు మంచి ప్రతిభ ఉంది. 

‘గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డు-2020’ సాధించిన సందర్భంగా సుచేత మాట్లాడుతూ తనకు రెండు విభాగాల్లో పురస్కారాలు లభించాయనీ..పలు భాషల్లో పాటలు పాడినందుకు, లైవ్‌లో సుదీర్ఘ సమయం పాటలు పాడినందుకు పురస్కారాలు లభించాయని తెలిపారు. తాను 120 భాషల్లో ఆరు గంటలపాటు ఆగకుండా పాడానని సుచేత తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 100 గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీలను వివిధ విభాగాలలో సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని సుచేత ఆనందం వ్యక్తంచేసింది.