Shark Attack On Girl : డాల్ఫిన్లతో ఆడుకోవటానికి సముద్రంలో దూకిన బాలిక..నోటకరచుకుపోయిన షార్క్ ఫిష్

డాల్ఫిన్లతో ఆడుకోవటానికి సముద్రంలో దూకిన బాలికపై ఓ షార్క్ చేప ఎటాక్ చేసింది. బాలికపై దాడి చేయటంతో మృతి చెందింది.

Shark Attack On Girl :  డాల్ఫిన్లతో ఆడుకోవటానికి సముద్రంలో దూకిన బాలిక..నోటకరచుకుపోయిన షార్క్ ఫిష్

Shark Attack On Girl in Australia Swan River

Shark Attack On Girl : సముద్రంలో డాల్ఫిన్లు చేసే చేష్టలు చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. పల్టీలు కొడుతూ..నీటితో వేగంగా పైకి తేలుతూ..మునుగుతూ చేసే డాల్ఫిన్లను చూస్తే మనం కూడా వాటితో కలిసి సరదాగా ఆడుకుంటే భలేగుంటుంది కదూ అనిపిస్తుంది. ఓ బాలిక కూడా అలాగే అనుకుంది. సముద్రంలో సందడి చేస్తున్న డాల్ఫిన్లను కూడా ముచ్చటపడింది. వాటితో పాటు ఆడుకోవాలనుకుంది. వాటితో కలిసి ఈత కొట్టాలనుకుంది. కానీ సముద్రం ఎంత అందమైనదో..అంత ప్రమాదకరమైనది అని తెలుసుకోలని ఓ 16 ఏళ్ల బాలికి డాల్ఫిన్లతో కలిసి ఊత కొట్టటానికి అమాంతం సముద్రంలో దూసేకుంది. ఆనందంగా డాల్ఫిన్లతో సందడిచేయాలనుకున్న ఆ చిన్నారి కొద్ది నిమిషాల్లోనే ఓ రాకాసి షార్క్ చేపకు ఆహారంగా మారిపోయింది.

శనివారం (ఫిబ్రవరి 5,2023)పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలోని స్వాన్‌ నది అందాలను చూడటానికి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లింది స్టెల్లా బెర్రీ అనే 16 ఏళ్ల బాలిక. ఫ్రెమాంటిల్‌ ఓడరేవు దగ్గర ట్రాఫిక్‌ బ్రిడ్జిపై నుంచి నదిలో అడుతున్న డాల్ఫిన్‌లను చూసింది. అక్కడ కొంతమంది డాల్ఫిన్‌లతో కలిసి ఈదుతుండటం చూసి.. తను కూడా డాల్ఫిన్‌లతో కలసి ఆడాలని ఈత కొట్టాలని ముచ్చటపడింది.

అంతే..డాల్ఫిన్ల వద్దకు వెళ్లాలనే ఆనందంలో ఆపద పొంచి ఉంటుందని గ్రహించలేకపోయింది. బాలిక అలా దూకడమే ఆలస్యం డాల్ఫిన్లకు సమీపంలో ఉండే ఓ షార్క్‌ ఫిఫ్ ఆమెపై దాడి చేసింది. నీటిపై ఈదుతున్న బాలికను ఒక్కసారిగా లోపలికి లాక్కెళ్లింది. అది గమనించిన బాలిక స్నేహితులు పెద్ద పెద్దగా కేకలు వేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నదిలో నుంచి బాలికను బయటికి తీసుకొచ్చారు. చికిత్స కోసం తరలించినా ..తీవ్ర గాయాలతో ఆమె అప్పటికే చనిపోయిందని తెలిపారు డాక్టర్లు.

పెర్త్ గుండా హిందూ మహాసముద్రంలోకి ప్రవహించే స్వాన్ నదిలో షార్క్ ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుందని మత్స్యశాఖ తెలిపింది. గత 100 ఏళ్లలో ఎప్పుడూ కూడా స్వాన్‌ నదిలో షార్క్‌ దాడి ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. కానీ తాజాగా జరిగిన ఈ షార్క్‌ దాడి ఘటనతో స్వాన్‌ నదీ పరవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదివైపు వెళ్లినప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.