Russian Troops : యుద్ధంలో 17,700 మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతోపాటు..(Russian Troops)

Russian Troops : యుద్ధంలో 17,700 మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

Russia Soldiers Killed

Russian Troops : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులకు పైగా రష్యా సేనలు యుక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.

తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 17వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ రక్షణశాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతోపాటు 625 ట్యాంకులు, 1751 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 143 యుద్ధ విమానాలు, 131 హెలికాప్టర్లు, 85 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.(Russian Troops)

Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

నెల రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన రష్యా.. మరిన్ని ప్రాంతాల్లో భీకర దాడులతో తెగబడుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని మరోసారి తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్‌ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.(Russian Troops)

ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ఉక్రెయిన్‌- రష్యా చర్చల్లో కొంత పురోగతి సాధించామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ తెలిపారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్ సమర్పించిన ప్రతిపాదనలకు మాస్కో తన జవాబును సిద్ధం చేస్తోందని చెప్పారు. భారత్‌ పర్యటనలో ఉన్న లావ్రోవ్‌.. శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌తో భేటీ అనంతరం మాట్లాడారు. కీవ్‌తో చర్చలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది ఇలా ఉంటే.. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు ఆన్‌లైన్‌ వేదికగా శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. యుక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. తమ భూభాగంలోని ఇంధన డిపోపై ఉక్రెయిన్‌ బలగాలు దాడి చేశాయని రష్యా ఆరోపిస్తున్న వేళ.. ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన చర్చల్లో కొంత పురోగతి వచ్చిన విషయం తెలిసిందే.

Russia-Ukraine War:నేలపై వైరం..ఆకాశంలో స్నేహం..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరిన రష్యా,అమెరికా వ్యోమగాములు..!!

యుక్రెయిన్‌ పోర్ట్‌ సిటీ మరియుపోల్‌లో రష్యన్‌ దాడుల కారణంగా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని స్థానిక పాలనా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. ‘ఆక్రమణదారు చేసిన ప్రతి నేరం, ప్రతి హత్య, విధ్వంసాన్ని రికార్డ్ చేయాలి. న్యాయం కోసం వాటిని అంతర్జాతీయ న్యాయస్థానానికి పంపాలి’ అని మేయర్‌ వాదిమ్‌ బోయ్‌చెంకో అన్నట్లు సిటీ కౌన్సిల్ తెలిపింది. ఈ చర్యలను రికార్డ్ చేయడానికి కౌన్సిలర్ల ప్రత్యేక కమిటీ బాధ్యత వహిస్తోందని కౌన్సిల్ వెల్లడించింది.