China: ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి!

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్‌ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.

China: ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి!

China

China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్‌ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. తెల్లవారు జామున కావడంటతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించకపోవడంతోనే ఇంత భారీస్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తుంది.

ఇప్పటికి ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 16 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 13న సెంట్రల్‌ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణ లోపాలుతోనే ఆ ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.