1955 Mercedes-Benz..300 SLR : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..ధర రూ.1100 కోట్లు..!!
1955 మోడల్.. మెర్సిడెజ్ మేడ్..బెంజ్ 300 ఎస్ఎల్ఆర్..మీరు చూస్తున్నది.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. ఇది.. మెర్సిడెజ్ కంపెనీకి చెందిన బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెనాట్ కూపే మోడల్. జర్మనీలోని.. మెర్సిడెజ్ బెంజ్ మ్యూజియంలో ఈ నెల 5న వేలం పాట జరిగింది. సీక్రెట్‌గా నిర్వహించిన ఈ ఆక్షన్‌కు.. ఇన్విటేషన్ ఉన్నవారినే మాత్రమే అనుమతించారు. ఈ వేలంపాటలో.. కూపే కార్ 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే.. మన క్యాష్‌లో సుమారు 11 వందల కోట్లకు పైమాటే.

1955 Mercedes-Benz..300 SLR : కార్లయందు.. లగ్జరీ కార్లు వేరు. వాటి ఫీచర్స్, వాటి డిజైన్స్, వాటి రేట్లు, వాటికుండే డిమాండ్.. ఇలా.. మిగతా కార్లతో పోలిస్తే.. లగ్జరీ కార్ల కథ వేరే ఉంటది. ఎంత లగ్జరీ కారైనా.. ఎంత గొప్ప ఫీచర్స్ ఉన్నా.. మార్కెట్లో ఎంత డిమాండ్ ఉన్నా.. 50 నుంచి వంద కోట్లు పలుకుతుంది. అది.. లగ్జరీలోనే తోపెస్ట్ కారైతే. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రేటెంతో తెలుసా? సుమారు.. 11 వందల కోట్లు. ఓ వేలంలో.. ఆ కారు పలికిన ధర ఇది. అందులో.. అంత స్పెషాలిటీ ఏముంది?
1955 మోడల్.. మెర్సిడెజ్ మేడ్..బెంజ్ 300 ఎస్ఎల్ఆర్..మీరు చూస్తున్నది.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. ఇది.. మెర్సిడెజ్ కంపెనీకి చెందిన బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెనాట్ కూపే మోడల్. జర్మనీలోని.. మెర్సిడెజ్ బెంజ్ మ్యూజియంలో ఈ నెల 5న వేలం పాట జరిగింది. సీక్రెట్‌గా నిర్వహించిన ఈ ఆక్షన్‌కు.. ఇన్విటేషన్ ఉన్నవారినే మాత్రమే అనుమతించారు. ఈ వేలంపాటలో.. కూపే కార్ 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే.. మన క్యాష్‌లో సుమారు 11 వందల కోట్లకు పైమాటే.
ఈ వింటేజ్ కూపే కార్కి.. చాలా స్పెషాలిటీస్ ఉన్నాయ్. 1955లో మెర్సిడెజ్- బెంజ్ కంపెనీ రేసింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసిన రెండు డిజైన్లలో.. ఇదొకటి. ఉహ్లెనాట్ కూపే అనే పేరు.. దాని చీఫ్ ఇంజనీర్ రుడాల్ఫ్ ఉహ్లెనాట్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టారు. వేలం పాటలో 11 వందల కోట్లు పలికిన తొలి కార్ ఇదే. బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్.. సీక్రెట్‌గా ఓ పేరు లేని క్లయింట్ తరఫున వేలం వేశారు.
ఈ బెంజ్ కార్.. ఇంత ధర పలకడానికి కారణం.. మెర్సిడెజ్ దగ్గర ఇలాంటి కార్లు రెండే ఉన్నాయ్. అందులో ఒకదాన్ని వేలం వేస్తే.. ఇంత భారీ ధర పలికింది. ఖరీదైన కార్ల వేలం పాట నిర్వహించే ఆర్ఎం సోత్‌బై ఈ విషయాన్ని ప్రకటించింది. ఓ ప్రైవేట్ కలెక్టర్.. ఈ కారును వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలిపింది. వేలంపాటలో అమ్ముడుపోయిన టాప్ 10 అత్యంత విలువైన వస్తువుల్లో.. ఈ కారు కూడా చేరింది. AFP ర్యాంకింగ్ ప్రకారం ఈ మధ్యకాలంలో.. వేలంలో అమ్ముడుపోయిన యాంటిక్ పీసెస్‌లో బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఆరు లేదా ఏడో స్థానంలో ఉంది.
ఈ బెంజ్ కారును.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉంటుందని.. వేలంపాటలో సొంతం చేసుకున్న వ్యక్తి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయ్. ఇలాంటిదే.. మరో కారు మెర్సిడెజ్ కంపెనీ దగ్గరే ఉంటుంది. దానిని.. మెర్సిడెజ్-బెంజ్ మ్యూజియంలో చూడొచ్చు. ఈ కార్ ఫీచర్స్ చూస్తే.. అసాధారణంగా ఉండే లైన్స్, బటర్‌ఫ్లై డోర్స్ అట్రాక్ట్ చేస్తాయి. స్పోర్ట్స్ రేసింగ్ కోసం.. ఈ కారులో శక్తిమంతమైన 3.0 లీటర్ ఇంజిన్ని అమర్చారు. ఇది.. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లగలదు. 1954, 1955లో ఇటాలియన్ జువాన్ మాన్యుయెల్ ఫాంగియో ఈ గ్రాండ్ ప్రిక్స్ కారుతోనే.. రెండు ఎఫ్-1 వరల్డ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.
గతంలో.. 1962 నాటి ఫెరారీ 250 జీటీఓ కార్‌ను 2018లో వేలం వేస్తే.. 48 మిలియన్ డాలర్ల ధర పలికింది. అంటే.. మన కరెన్సీలో 373 కోట్లు. ఈ రికార్డును.. మెర్సిడెజ్-బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ బద్దలు కొట్టేసింది. మూడు రెట్ల ధర ఎక్కువ పలికి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా.. కొత్త రికార్డ్ సృష్టించింది.
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?