ఢిల్లీలో పాకిస్తానీ సీక్రెట్ ఏజెంట్ల గస్తీ

  • Published By: Subhan ,Published On : June 1, 2020 / 02:40 AM IST
ఢిల్లీలో పాకిస్తానీ సీక్రెట్ ఏజెంట్ల గస్తీ

పాకిస్తాన్ హై కమిషన్‍‌కు చెందిన ఇద్దరు అధికారులను భారత్‌లో పట్టుకున్నారు. దేశంలో గూడఛారి వ్యవహరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ‘వారిద్దరూ ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా తిరుగుతున్నారు. ఉద్దేశ్యపూర్వకమైన పని మీదనే వచ్చినట్లు తెలిసింది. 24గంటల్లోగా ఇండియా వదిలివెళ్లాలని ఆదేశించాం’ అని విదేశాంగ శాఖ తెలిపింది. 

‘పాకిస్తాన్ హై కమిషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసినందుకు గానూ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. భారత్‌లో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నట్లుగా తెలిస్తే తమకు తెలియజేయాలని పాకిస్తాన్ కోరింది’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. 

ఢిల్లీ పోలీసులు వారిని స్పెషల్ సెల్‌లో ఉంచారు. వారి పేర్లు అబీద్ హుస్సేన్, తాహీర్ ఖాన్ లుగా గుర్తించారు. పాకిస్తాన్ హై కమిషన్ వీసా సెక్షన్ లో ఉద్యోగం చేస్తున్నారు. అంతేకాకుండా వీరు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ లేదా ISI లలో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి వద్ద నుంచి ఫేక్ ఐడెంటిటీ ప్రూఫ్‌లు స్వాధీనపరచుకున్నారు. 

Read: ముస్లిం యువతకు జీవనాధారమైన 200ఏళ్ల నాటి దేవాలయం