US Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి..

అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో టోర్నడోలు ప్రభావం వల్ల 21 మంది మరణించారు. 50మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ప్రధాన నగరాల్లోసైతం వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

US Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి..

America Tornadoes

US Tornadoes: అమెరికాలోని దక్షిణ, మిడ్‌వెస్ట్‌లోని పలు పట్టణాలు, పెద్ద నగరాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుసార్లు సంభవించిన టోర్నడోలు వల్ల 21 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ప్రధాన నగరాల్లోసైతం వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టోర్నడోలు కారణంగా క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Hindu University of America : అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి రూ.8.20 కోట్లు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త

ఇండియానా రాష్ట్రంలోని సులివాన్ కౌంటీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జాడ తెలియట్లేదని అధికారులు తెలిపారు. క్రాఫోర్డ్ కౌంటీ‌బోర్డ్ వైస్ చైర్మన్ బిల్ బుర్కే మాట్లాడుతూ.. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి 9.10 గంటలకు కౌంటీని టోర్నడోలు తాకడంతో ముగ్గురు మరణించగా, ఎనిమిది మందికి గాయాలైనట్లు తెలిపారు. ఆర్కన్సాస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ నగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 25 మందికి గాయాలయ్యాయి. ఇల్లినాయ్ రాష్ట్రంలో బెల్విడీర్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న థియేటర్ నేలమట్టమై సదర్శకుల్లో ఒకరు మరణించారు. 28 మంది క్షతగాత్రులుగా మారినట్లు అధికారులు తెలిపారు.

Indian-American Teen: 75 రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి చేరిన తన్వి

ఎనిమిది రాష్ట్రాల్లో ఈ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. అర్కాన్సాస్ లోని లిటిల్ రాక్ సమీపంలో 2వేలకుపైగా భవనాలు దెబ్బతిన్నాయని మేయర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. టోర్నడోల్ వల్ల అయోవా , ఓక్లహామా ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. దాదాపు మూడు లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మరో వారం రోజుల వరకు మరికొన్ని భారీ తుఫాన్లు, టోర్నడోలు వచ్చేఅ వకాశాలు లేకపోలేదని వాతావరణ విభాగం హెచ్చరించింది.

America Tornado : అమెరికాలో టోర్నడో బీభత్సం.. 26 మంది మృతి

ఈ ఏడాది గత నెల 25న మిస్సిస్సీపీలో టోర్నడోలు బీభత్సం కారణంగా బలమైన గాలులు వీయడంతో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ టోర్నడోలు కారణంగా భారీ నష్టం జరిగిందని, సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు.