Surfer Katherine Diaz : అయ్యో… నీళ్లే ప్రాణంగా బతికిన అమ్మాయి, చివరికి నీటిలోనే చనిపోయింది..

నీళ్లే ప్రాణంగా బతికిన ఓ యువ క్రీడాకారిణి... కల నెరవేరకుండానే.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. దురదృష్టవశాత్తూ..

Surfer Katherine Diaz : అయ్యో… నీళ్లే ప్రాణంగా బతికిన అమ్మాయి, చివరికి నీటిలోనే చనిపోయింది..

Surfer Katherine Diaz

Surfer Katy Diaz : ఎల్ సల్వడార్ లో(El Salvador) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీళ్లే ప్రాణంగా బతికిన ఓ యువ క్రీడాకారిణి… కల నెరవేరకుండానే.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై కన్నుమూసింది.

El Salvador's top surfer

ఆ యువతి పేరు కేథరిన్‌ డియాజ్‌. వయసు 22ఏళ్లు. సాల్వడోర్ దేశంలో అగ్రశేణి సర్ఫర్. టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై కన్నుమూసింది.

Top Salvadoran surfer dies

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం డియాజ్ సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. ‘‘మా దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలు. దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది’’ అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Katherine Diaz