నెలలో 23పెళ్లిళ్లు..విడాకులు : దంపతుల భారీ కుంభకోణం తెలిస్తే షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2019 / 11:35 AM IST
నెలలో 23పెళ్లిళ్లు..విడాకులు : దంపతుల భారీ కుంభకోణం తెలిస్తే షాక్

చైనాలో ఓ జంట ఒక నెలలో 23సార్లు నకిలీ పెళ్లిళ్లు చేసుకుని 23సార్లు నకిలీ విడాకులు తీసుకున్నారు. అయితే ఇందులో ఓ భారీ కుంభకోణం దాగి ఉంది. పెళ్లిళ్లు చేసుకుని..వీడాకులు తీసుకుంటే భారీ కుంభకోణం ఏంటని అనుకుంటున్నారా?

సాధారణంగా చైనాలోని సిస్టమ్ ప్రకారం… కొత్త అభివృద్ధి కోసం ఎవరిదైనా ఇళ్లు పడగొడితే ఆ ఇంట్లోని ప్రతి ఒక్క కుటుంబసభ్యుడికి కొత్తగా అభివృద్ధి చేసిన స్థలంలో 40చదరపు అడుగుల స్థలం నష్టపరిహారంగా ఇస్తారు. అయితే దీన్ని అవకాశంగా భావించిన లిషుయికి చెందిన ఓ జంట ఓ మాస్టర్ ఫ్లాన్ వేసింది. పాన్ అనే భర్త తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ తిరిగి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు తర్వాత మళ్లీ తన భార్యకు విడాకులు ఇచ్చి తన మరదలిని పెళ్లి చేసుకున్నాడు. తన ఫ్లాన్ లో తన మరదలిని కూడా భాగం చేశాడు.

ప్రభుత్వం దీన్ని గుర్తించే వరకు  పాన్ కు తన ఫ్లాన్ లో భాగంగా నష్టపరిహారంగా భారీగా స్థలాలు దక్కుతున్నాయి. అయితే పాన్ ఇళ్లు అకస్మాత్తుగా 13మందికి నివాసంగా మారడాన్ని గుర్తించిన అధికారులు అందులో 11మందిని అరెస్ట్ చేశారు. చైనాలో ఇది ఒక తీవ్రమైన కేసుగా పరిగణిస్తారు.లిషుయిలో గృహ ధరలు గత రెండేళ్ళలో 31% వరకు పెరిగాయని ఫాంగ్జియా.కామ్‌ డేటా ప్రకారం తెలుస్తోంది.