అమెరికాలో 25 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

  • Published By: venkaiahnaidu ,Published On : June 16, 2020 / 01:39 PM IST
అమెరికాలో 25 అడుగుల ఎత్తైన హనుమాన్  విగ్రహ ప్రతిష్టాపన

అమెరికాలోని డెలావర్‌లో 25 అడుగుల ఎత్తైన విగ్రహం కొలువుదీరింది. న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్‌సిన్‌లో ఈ విగ్రహాన్ని సోమవారం  ప్రతిష్ఠించారు. ఇది యూఎస్ లోనే  ఎత్తైన హిందూ దేవుడి విగ్రహం.45 టన్నుల  బరువున్న హనుమంతు విగ్రహం పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టింది.  

హాక్‌సిన్‌లో హిందూ ఆలయ సంఘం అధ్యక్షుడు పతిబానంద శర్మ మాట్లాడుతూ.. ఈ విగ్రహం తెలంగాణలోని వరంగల్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పతిబానంద శర్మ వివరించారు. 

జనవరిలో, 25 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం  హైదరాబాద్ నుండి న్యూయార్క్ వరకు ఓడ ద్వారా, ఆపై ఫ్లాట్బెడ్ ట్రక్ ద్వారా డెలావేర్ రాష్ట్రంలోని అతిపెద్ద హిందూ దేవాలయానికి ప్రయాణించింది