కరోనా వైరస్ యాంటీబాడీస్‌.. స్వల్పకాలిక వ్యాధినిరోధకత ఇవ్వగలవు : సీడీసీ

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 04:45 AM IST
కరోనా వైరస్ యాంటీబాడీస్‌.. స్వల్పకాలిక వ్యాధినిరోధకత ఇవ్వగలవు : సీడీసీ

కరోనా వైరస్ యాంటీబాడీ టెస్టులు నమ్మదగినవి అయినప్పటికీ.. వైరస్ సోకిన వ్యక్తి వ్యాధినిరోధకతను తిరిగి పొందలేకపోతున్నారు అనేది అస్పష్టంగా ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో తయారైన యాంటీబాడీలతో స్వల్పకాలిక వ్యాధినిరోధకత ఇస్తాయని అంటున్నారు. కానీ, దీనికి సంబంధించి మరింత డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెబుతోంది. ఎవరైనా తిరిగి ఆఫీసులకు రావాలా? లేదా పాఠశాలలు లేదా అందరితో కలిసి ఉండొచ్చా అని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షలను నిర్వహించరాదని ఏజెన్సీ స్పష్టంగా హెచ్చరించింది.

కరోనావైరస్ వల్ల ‘స్వల్పకాలిక రోగనిరోధక శక్తి’ ఏర్పడుతుందని కొన్ని ఆధారాలు సూచించినప్పటికీ COVID-19 యాంటీబాడీస్.. వైరస్ నుండి రక్షణను ఇస్తుందో లేదో ఇంకా తెలియదు. భౌతిక దూరం, ఫేస్ మాస్క్‌లు ఇప్పటికీ చాలా అవసరమేనని గుర్తించాలి. కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నాయని వీటిని వాడటం ఆపేయకూడదని సూచించింది. యాంటీబాడీస్‌తో వ్యాధినిరోధకతలో మార్పులకు మరింత డేటా అవసరమని ఏజెన్సీ తెలిపింది. ఆక్సియోస్ కైట్లిన్ ఓవెన్స్ ద్వారా సిడిసి  అప్‌టేట్ చేసిన మార్గదర్శకాలు సమర్థవంతమైన యాంటీబాడీ పరీక్షలు కూడా తప్పుడు పాజిటివ్ రేట్లను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. 

ఎందుకంటే చాలా మంది కరోనావైరస్ పాజిటివ్ పరీక్షలు చేయలేదు. డయాగ్నొస్టిక్ యాంటీబాడీ కరోనావైరస్ పరీక్షల ఫలితాలను మిళితం చేస్తున్నట్లు గత వారం ధృవీకరించిన తరువాత సిడిసి  హెచ్చరిక వచ్చింది. వైరస్ ఎంత విస్తృతంగా ఉందనే దానిపై డేటాను విశ్లేషిస్తోంది. యాంటీబాడీ పరీక్షల ప్రాధమిక ఉపయోగాలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఇంతకుముందు కరోనావైరస్ సంక్రమించిన వారిని గుర్తించే యాంటీబాడీ పరీక్షలు రోగనిరోధక శక్తిని నిర్ణయించడానికి ఉపయోగించరాదని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Read: ఫేస్ మాస్కుల‌తో జర జాగ్రత్త!