Spain Crime : తల్లిని చంపి తినేసిన కొడుకు..మిగిలిన మాంసం కుక్కలకు వేసిన నరరూప రాక్షసుడు

కన్న తల్లినే చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన కొడుకుకు కోర్టు జైలు శిక్ష విధించింది. తల్లితో జరిగిన ఓ గొడవతో తల్లిని చంపి తినేసిన కొడుకుకు ధర్మాసనం దాదాపు రెండేళ్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Spain Crime : తల్లిని చంపి తినేసిన కొడుకు..మిగిలిన మాంసం కుక్కలకు వేసిన నరరూప రాక్షసుడు

Man Who Killed And Ate His Mother

Spanish man killed and ate his mother : నరమాంస భక్షకులు ఉంటారని సినిమాల్లో చూసి ఉంటాం. పుస్తకాల్లో చదివి ఉంటాం. కొన్ని వార్తల్లో కూడా వినే ఉంటాం. కానీ..నిజంగానే నరమాంస భక్షకులు ఉన్నారా? అనే అనుమానాలు మాత్రం ఉంటూనే ఉన్నాయి. కానీ నిజమేననే ఓ అత్యంత దారుణాతి దారుణ ఘటన జరిగింది స్పెయిన్ లో. ఓ ఉన్మాది కన్నతల్లినే చంపి తినేసాడు. తల్లిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి..తిన్నంత తిని..మిగిలిన మాంసాన్ని కుక్కలకు వేసిన అత్యంత దారుణమైన నరమాంస భక్షుడికి కోర్టు జైలు శిక్ష విధించిన ఘటన స్పెయిన్ లో జరిగింది..!ఆ నరరూప రాక్షసుడి పేరు ఆల్బెర్టో శాంచెజ్ గోమెజ్. వయస్సు కేవలం 2 ఏళ్లు. ఇంత చిన్నవయస్సులోనే రాక్షసుడిగా మారాడు అల్బెర్డో శాంచెజ్. తల్లితో జరిగిన చిన్న గొడకు రాక్షసుడిగా మారి చంపి తినేశాడు. ఈ దారుణం గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 2019లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

కాగా.. రెండేళ్ల కిందట 60 ఏళ్ల మరియా సోలెడాడ్ గోమెజ్ కనిపించకపోవటంతో ఆమె స్నేహితుడు ఆందోళన వ్యక్తం చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తూర్పు మాడ్రిడ్ లోని నివసిస్తున్న మరియా ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో మరియా ఇంటి వద్ద సంచరిస్తున్న అనుమానంగా సంచరిస్తున్న ఆల్బెర్టో శాంచెజ్ గోమెజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉన్మాద స్థితిలో ఉన్న ఆల్బెర్టో ను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అతను పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు. కొన్ని మాంసం ముక్కలు అక్కడే ఉన్న కుక్కకు వేస్తున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న అల్బెర్డోను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడే ఉన్న మాంసం ముక్కలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించగా వచ్చిన రిపోర్టును చూసి షాక్ అయ్యారు. ఆ మాసం ఆల్బెర్టో తల్లిదేనని గుర్తించారు. ఆల్బెర్టోనే తల్లిని చంపి తిన్నట్లుగా విచారణలో తేలింది.

అనంతరం పోలీసులు దర్యాప్తులో భాగంగా మరియా ఇంటికొచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. తల్లి శరీర భాగాలను తింటూ కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించారు.మరికొన్ని శరీర భాగాలు ప్లాస్టిక్ కంటైనర్లలో గుర్తించారు. ఈ వివరాలన్నింటిని సేకరించిన పోలీసులు..ఆల్బెర్డోపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో గోమెజ్ తల్లిని చంపి తిన్నాడని రుజుమైంది. కోర్టులో విచారణ సందర్భంగా ఆల్బెర్టో శాంచెజ్ గోమెజ్ ను న్యాయమూర్తి ప్రశ్నించగా..‘నాకు ఏమీ తెలియదని ఏదో ఉన్మాద స్థితిలో తల్లిని చంపి తినేశానని‘ నా తల్లికి నాకు ఓ విషయంలో గొడవ జరిగిందని ఆ ఉన్మాదంలోనే ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. కానీ న్యాయమూర్తి గోమెజ్ వాదనలను నమ్మలేదు. పోలీసులు ఇచ్చిన వివరాలు..ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టను బట్టి న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. తల్లిని హత్య చేసినందుకు 15 ఏళ్లు..ఆమె శరీర భాగాలను తిన్నందుకు మరో 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పరిహారంగా సోమెజ్ సోదరుడికి 60 వేల యూరోలను చెల్లించాలని ఆదేశించారు.

కాగా..తల్లితో జరిగిన ఓవివాదంతో సోమెజ్ ఆగ్రహంతో 60 ఏళ్ల తల్లి మరియాlను చంపి ఆమె శరీరాన్ని ముక్క ముక్కలుగా చేసి శరీర భాగాలను తినేని కొన్నింటిని తన కుక్కకు కూడా తినిపించాడు.మరికొన్ని ముక్కలను ప్లాస్టిక్ కంటైనర్ లో వేసిన ఆ నరరూప రాక్షసుడికి పడిన 15 ఏళ్ల జైలు శిక్ష చాలా తక్కువేనంటున్నారు స్పానిష్ మీడియా.