Chinese Astronauts: ఆర్నెళ్ల తరువాత సురక్షితంగా భూమికి చేరిన ముగ్గురు చైనా వ్యోమగాములు

ఆరు నెలల స్పేస్ మిషన్ తరువాత ముగ్గురు చైనా వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరారు. కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంకు ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లిన చైనా అంతరిక్ష నౌక షెనౌజౌ-14 ఆదివారం ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ ఫెంగ్ ల్యాండింగ్ సైట్ లో సురక్షితంగా ల్యాడ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Chinese Astronauts: ఆర్నెళ్ల తరువాత సురక్షితంగా భూమికి చేరిన ముగ్గురు చైనా వ్యోమగాములు

Chinese Astronauts: ఆరు నెలల స్పేస్ మిషన్ తరువాత ముగ్గురు చైనా వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరారు. కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంకు ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లిన చైనా అంతరిక్ష నౌక షెనౌజౌ-14 ఆదివారం ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ ఫెంగ్ ల్యాండింగ్ సైట్ లో సురక్షితంగా ల్యాడ్ అయినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు, వ్యోమగాములు చెన్ డాంగ్, లియు యాంగ్, కాయ్ జుజేలు షెనౌజౌ-14 అంతరిక్ష కేంద్రం నుండి ఒకరితరువాత ఒకరు బయటకు వచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రధాన కార్యాలయానికి వారిని తరలించారు.

Chinese astronauts spacewalk: చైనా కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ వాక్ చేసిన ఇద్దరు వ్యోమగాములు

ఇదిలాఉంటే ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో దాదాపు 183 రోజులు నివసించారు. అంతకుముందు ముగ్గురిని మోసుకెళ్లిన షెనాజౌ-14 అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. దాని స్థానంలో ముగ్గురు వ్యోమగాములు నవంబర్ 29న షెంజౌ-15 స్పేస్ షిప్ ద్వారా నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి పంపబడ్డారు.

 

అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు షెన్‌జౌ-14 వ్యోమగాములను జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పంపారు. వారు గత కొన్ని నెలలుగా డాకింగ్‌లను పర్యవేక్షించడం, మూడు ఎక్స్‌ట్రావెహిక్యులర్ కార్యకలాపాలు నిర్వహించడం, ఒక లైవ్ సైన్స్ లెక్చర్ ఇవ్వడం, నిర్వహించడం వంటి అనేక పనులను పూర్తి చేశారు. అమెరికాతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి చేయాలని చైనా యోచిస్తోంది.