Nagaland Lipavi : హాస్పిటల్‌కు వెళ్లిన మూడేళ్ల చిన్నారి..ఫొటో వైరల్

నా ఆరోగ్యం ఎలా ఉంది చెక్ చేయగలరు..అంటూ మూడేళ్ల చిన్నారి..డాక్టర్లను అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. హాస్పిటల్ కు వెళ్లిన ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nagaland Lipavi : హాస్పిటల్‌కు వెళ్లిన మూడేళ్ల చిన్నారి..ఫొటో వైరల్

Nagaland

3 Year Old Girl In Nagaland : నా ఆరోగ్యం ఎలా ఉంది చెక్ చేయగలరు..అంటూ మూడేళ్ల చిన్నారి..డాక్టర్లను అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. హాస్పిటల్ కు వెళ్లిన ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జున్హెబోటో జిల్లాలోని ఘతషి..హెబోలిమి ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగాలాండ్ కు చెందిన మూడేళ్ల లిపావికి జలుబు చేసింది.

లిపావి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిపోయారు. దీంతో ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయాలని అనుకుంది. తన ఇంటికి కొద్ది దూరంలో ఆరోగ్య కేంద్రం ఉన్న సంగతి తెలిసింది. దీంతో లిపావి..ఆరోగ్య కేంద్రానికి వెళ్లి…చెకప్ చేయాలని కోరింది. లిపావిని చూసి అక్కడున్న ఆరోగ్య సిబ్బంది ఆశ్చర్యపోయారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి.. జాగ్రత్తగా ఇంటికి పంపించారు. వైద్యురాలు చిన్నారి లిపావిని చెకప్ చేస్తున్న ఫొటోలను Benjamin Yepthomi.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో తెగ వైరల్ అయ్యింది. పెద్ద వాళ్లకు ఆదర్శంగా లిపావి నిలిచిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : TS Covid-19 Updates: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. పాజిటివిటి రేటు అంతే..