అక్రమంగా అమెరికా : 311మంది భారతీయులను పట్టుకున్న మెక్సికో..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

10TV Telugu News

అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడిన 311మంది భారతీయులను తీసుకొస్తున్న విమానం శుక్రవారం(అక్టోబర్-17,2019)ఢిల్లీ చేరుకోనుంది. ఓ ప్రత్యేక విమానంలో మెక్సికో నుంచి వీరందరిని భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఈ 311మంది భారతీయులు గడిచిన కొన్ని నెలల్లో ఇంటర్నేషనల్ ఏజెంట్ల సాయంతో అక్రమంగా మెక్సికోలోకి ప్రవేశించారని,ఏజెంట్లు వారిని అక్రమంగా మెక్సికో నుంచి యూఎస్ లోకి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారందరూ మెక్సికోకు అక్రమంగా వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు తెలిపాయి.

ఈ 311మంది రెండు ప్రైవేటు విమానాల్లో భారత్ నుంచి మెక్సికోకు వచ్చారని,ట్రావెల్ ఏజెంట్లు వీళ్లను రిసీవ్ చేసుకుని ఒక్కొక్కరి దగ్గర రూ.25-30లక్షల వరకూ వసూలు చేశారని ఓ సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్ నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారు. 310మంది మగవాళ్లు కాగా ఒక్క మహిళ ఇందులో ఉన్నారు.

ఈ 311మందిని భారతీయులు బోయింగ్ 747-400 విమానంలో స్పెయిన్ లోని మాడ్రిడ్ మీదుగా భారత్ చేరుకోనున్నారు. వీరందరికీ..భారతీయులకు తమ దేశంలో చేరుకోవడానికి అత్యవసరంగా ఇచ్చే వన్ వే ట్రావెల్ డాక్యుమెంట్(ఎమర్జెన్సీ సర్టిఫికెట్)ఇవ్వబడినట్లు సమాచారం. పాస్ పోర్ట్ పోగొట్టుకున్న,వాలిడ్ పాస్ పోర్టు లేకున్నా,స్వతంత్రులకు,పాస్ పోర్టులకు డ్యామేజ్ అయితే ఇలాంటి పేపర్లు ఇస్తారు.