US court : అమెరికాలో భారతీయుడికి 10 ఏళ్ల జైలు..శిక్ష పూర్తయ్యాక దేశ బహిష్కరణ

అమెరికాలో ఓ భారతీయుడికి కోర్టు 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తి అయ్యాక దేశం విడిచిపెట్టిపోవాలని ఆదేశించింది.

US court : అమెరికాలో భారతీయుడికి 10 ఏళ్ల జైలు..శిక్ష పూర్తయ్యాక దేశ బహిష్కరణ

Indian National Sentenced To 10 Years In Jail

Indian national to 10 years in jail in US : అమెరికాలో ఓ భారతీయుడికి కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ప్రదీష్ జెహాన్ సెల్వరాజ్ అనే భారతీయుడు ఇద్దరు బాలికలను ప్రలోభపెట్టి ట్రాప్ చేయడానికి ప్రయత్నించి యూఎస్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇద్దరు బాలికలను ట్రాప్ చేయటానికి యత్నించిగా వ్యూహాత్మకంగా వల పన్నిన పోలీసులు ప్రదీష్ జైహాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా అతనికి యూఎస్ న్యాయస్థానం 10ఏళ్ల జైలుశిక్ష విధించింది. శిక్ష పూర్తి అయ్యాక దేశం వదిలిపెట్టిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎంతోమంది భారతీయులు అమెరికాకు చదువుల కోసం వెళతారు. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగంలో చేరి బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ అటువంటి అవకాశం అందరికీ రాదు.వచ్చినవారు సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయకుండా వేరే ట్రాక్ లో పడితే ఇదిగో ఇలా ప్రదీష్ జైహాన్ లాగా జైలులో గడపాల్సి వస్తుంది.అమెరికాలోని ఒమాహాలో నివసించే ప్రదీష్ జెహాన్ సెల్వరాజ్. 35 ఏళ్ల సెల్వరాజ్ బాలికలను ప్రలోభపెట్టి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకునే పనిలో పడ్డాడు.దాంట్లో భాగంగా 2020 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 4 మధ్య 15 సంవత్సరాల బాలికను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు.

ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వ్యభిచార అడ్వర్‌టైజ్‌మెంట్‌ను చూసిన సెల్వరాజ్ స్పందించాడు. ప్రకటనలో ఇచ్చిన నంబరుకు మెసేజ్ చేశాడు. ఇలా మైనర్లను ప్రలోభ పెట్టే వారిని పట్టుకోవడం కోసం పోలీసులే ఆ యాడ్ పెట్టిన ఉచ్చులో చిక్కుకున్నాడు. సెల్వరాజ్‌ మెసేజ్ లకు ఒక పోలీసు అధికారిణి 15 ఏళ్ల బాలికలా స్పందించింది. ఈ క్రమంలో ఆ బాలికకు (అడ్వర్ టైజ్ లో ఉన్న బాలిక అని భ్రవించి) సెల్వరాజ్ 80 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.6వేలు చెల్లించడానికి అంగీకరించాడు.

ఈ డబ్బుతో ఆ బాలికతోపాటు మరో 12 ఏళ్ల బాలికతో ఓరల్‌ సెక్స్ కోసం ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఇద్దరు అమ్మాయిలను ఒమాహాలో కలవడానికి రెడీ అయిన సెల్వరాజ్ మహా ఉత్సాహంగా వెళ్లాడు. ఇద్దరమ్మాయిలకు మెక్‌డొనాల్డ్స్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొస్తానని చెప్పి..వారు కలవాలని అనుకున్న ఏరియాకు పట్టుకెళ్లాడు.

అదే సమయంలో అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రదీష్ వద్ద ఉన్న కండోమ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కోర్టులో హాజరుపరచగా..విచారణ జరిపిన కోర్టు ప్రదీష్‌కు 120 నెలలు అంటే 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. అతన్ని సెక్సువల్ అపెండర్‌గా రికార్డు చేయాలని, శిక్ష పూర్తయిన తర్వాత ప్రదీష్‌ను అమెరికా నుంచి బహిష్కిరించి, స్వదేశానికి పంపేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.