సూపర్ మామ్ : ప్రసవానికి ముందే బిడ్డల కోసం వంటలు రెడీ

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 10:46 AM IST
సూపర్ మామ్ : ప్రసవానికి ముందే బిడ్డల కోసం వంటలు రెడీ

ఓ పక్కన ప్రసవం సమయం దగ్గర పడుతోంది. ఆ సమయంలో మహిళలకు శారీరకంగా చాలా  ఇబ్బందులుంటాయి. కానీ వాటిన్నింటీని పట్టించుకోకుండా తన బిడ్డల కోసం ఓ అమ్మ మనసు పడిన తపన అంతా ఇంతా కాదు. ఆమె చేసిన పని అమ్మంటే అంతే అనేలా చేసింది. ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన ఓ మహిళ (అమ్మ) మరోసారి గర్భం దాల్చింది. కానీ తను ప్రసవించిన తరువాత ఆ ముగ్గురు చిన్నారులకు ఆహారం విషయంలో ఏ ఇబ్బంది ఉండకూడదని ఆలోచించి ఆ అమ్మ మనస్సు ఏం చేసిందో తెలుసుకుందాం..
 

ఓ గర్భిణీ స్త్రీ ప్రసవానికి కొద్ది రోజుల ముందే ఒకటీ రెండు మూడు కాదు ఏకంగా 380 రకాల వంటకాలను రెడీ చేసింది. వాటిలో 152 రకాలు మీల్స్ తో పాటు 228 రకాల స్నాక్స్ ని రెడీ చేసింది. అవన్నీ తన బిడ్డల కోసమే. 37 వారాల గర్భిణీగా (9 నెలలు దాటి) ఉన్న జెస్సికా మే మాగిల్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నాలుగోసారి గర్భం దాల్చింది.ప్రసవం తర్వాత ఆ పిల్లలకు ఆహారంలో లోటు ఉండకూడదనీ..ప్రసవం తర్వాత తనకు అవసరమైన ఆహారాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలని భావించి..అన్నీ దగ్గర పెట్టుకుని ఏకంగా 380 రకాలను సిద్ధం చేసింది. ఎన్ని రోజులు నిల్వ ఉంచినా పాడుకాకుండా ఉండేలా వాటిని తయారు చేసి ప్యాక్ చేయడం గమనించాల్సిన విషయం. ఈ విషయం తెలిసి ఆ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు ఆమెను సూపర్ మామ్ అని పొగిడేస్తున్నారు. ఆమె తయారు చేసిన వంటకాలన్నీ పోషకాల ఆహారాలే కావడం విశేషం.