కరోనాను జయించిన మహిళ అద్భుతమై సలహాలు!..పాటిస్తే వైరస్‌కు చెక్ పెట్టెయొచ్చు!!

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 10:22 AM IST
కరోనాను జయించిన మహిళ అద్భుతమై సలహాలు!..పాటిస్తే వైరస్‌కు చెక్ పెట్టెయొచ్చు!!

కరోనా పేరు చెబితే చాలా ప్రపంచదేశాల్లోని ప్రజలంతా వణికిపోతున్నారు. కానీ ఓ మహిళ మాత్రం కరోనా వచ్చిందని కంగారుపడలేదు..భయపడలేదు. బేజారవ్వలేదు.శాంతంగా ఆలోచించింది. తగు జాగ్రత్తలు తీసుకుంది. కరోనాను జయించింది. ఆమె పేరు ఎలిజబెత్ ష్నీడర్.అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర్రంలోని అతిపెద్ద నగరమైన సియాటిల్‌లో ఉంటుంది. 

కరోనాను జయించిన ఎలిజబెత్ ష్నీడర్ కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడిందీ తెలుసుకుంటే అందరికీ ధైర్యం వస్తుంది. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైంది వాషింగ్టన్ లోనే.  బయో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన 37 సంవత్సరాల ఎలిజబెత్ తన కరోనా అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. కరోనా సోకిందని తెలిసిన  ఎలిజబెత్ ఇంటిదగ్గరే ఉండిపోయి తనకుతానే ట్రీట్ మెంట్ చేసుకున్నారు. కరోనా గురించి భయాందోళలకు గురైన ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తన అనుభవాన్ని నలుగురితో పంచుకుంటున్నానని ఆమె చెప్పారు. (అలా అని ఎవరి వారు ఇష్టమొచ్చినట్లుగా మిడి మిడి జ్ఞానంతో చేసుకోవద్దు.)

ప్రజలకు నమ్మకం కల్పించేందుకు ఇదంతా చెప్తున్నానని తెలిపిన ఎలిజిబెత్ మాట్లాడుతూ..నాకు సోకిన కరోనా తగ్గిందని అందరికీ అలాగే జరుగుతుందనుకోద్దు..ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని సూచించారు.  నాకు అంత తీవ్రంగా రాలేదు. పెద్దవయసువారితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి కరోనా వస్తే చాలా ఇబ్బందే. కాబట్టి కరోనా వచ్చినవారెవరైనాసరే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికే పరిమితం కావాలి. బైటకు వెళ్లవద్దు. ఇతరుల నుంచి దూరంగా ఉండాలి. 

ఫిబ్రవరి 23న నేను ఒకపార్టీకి వెళ్లివచ్చాను. ఆ తరువాత మూడురోజులకు జ్వరం వచ్చింది. నీరసంగా ఉన్నాసరే..ఆఫీసుకు వెళ్లాను. కానీ మధ్యాహ్నానికల్లా తలనొప్పి మొదలైంది.జ్వరం..ఒళ్లునొప్పులు కూడా వచ్చాయి. తేడాగా ఉందనుకుని ఆఫీసు నుంచి డ్యూటీ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాను. అలా సోఫాలో పడుకోవటం..లేచేసరికి 103 టెంపరేచర్ వచ్చేసింది. చలిజర్వం ఫుల్ గా వచ్చేసింది.  ఫ్లూ జ్వరం అనుకుని ఇంట్లో ఫ్లూ ఫీవర్ మందులు వేసుకున్నాను. రెండు మూడురోజుల్లో జ్వరం దిగివచ్చింది. కరోనా అనుకోలేదు. ఎందుకంటే దగ్గు, ఆయాసం లేదు. అందుకే కరోనా పరీక్ష చేయించుకోలేదు. 

అలా పార్టీకి వచ్చినవారందరికీ కూడా జ్వరాలు, చలి వచ్చాయి. దగ్గు, ఆయాసం లేదు. వారికీ వైద్యులు కరోనా పరీక్షలు చేయించుకోలేదు. జ్వరం దాదాపుగా తగ్గిపోయిన తర్వాత సియాటిల్ ఫ్లూ స్టడీ ప్రోగ్రాంలో పేరు ఎంటర్ చేయించుకుని ముక్కులోని ద్రవం శాంపిల్ పంపాను. కొద్దిరోజులకు నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. షాక్ అయ్యాను. ఆ పార్టీకి వచ్చినవారిలో ఓ ఐదుగురి వరకూ కరోనా సోకిందని తర్వాత తెలిసింది.

 కానీ కరోనాకు సంబంధించి పూర్తి లక్షణాలు కనిపించిన వారంరోజుల తర్వాత లేక లక్షణాలు పూర్తిగా తగ్గిపోయిన మూడు రోజులకు బయటకు రావచ్చని డాక్టర్లు  సూచించారు. అంటే నాకు వచ్చింది కరోనా జ్వరమే. కానీ సొంతంగా డాక్టర్ల సలహాలతో ఇంట్లోనే ఉండి నేను సొంతంగా చేసుకున్న ట్రీట్ మెంట్ తో అది తగ్గిపోయింది. ఇదంతా తలచుకుంటే ఆశ్చర్యంగా..గమ్మత్తుగా అనిపిస్తోందని ఆనందంగా చెప్పారు ఎలిజిబెత్.  

కరోనా లక్షనాలు ఎవరికైనా కనిపించి జబ్బు మరీ తీవ్రస్థాయికి చేరుకోకుండా ఉంటే ఇంటిపట్టునే ఉండి ఫ్లూ  జ్వరానికి సంబంధించి ట్రీట్ మెంట్ తీసుకోండి. వాటర్..జ్యూస్ లు వంటి లిక్విడ్స్ బాగా తాగాలి. ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. ఆందోళన చెందనకుండా ప్రశాంతంగా ఉండాలి.  అలాచేస్తే జబ్బు నెమ్మదిగా తగ్గుతుంది.అంతేకాదు ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది.  నేను అదే చేశాను. అందుకే నాకు కరోనా తగ్గిపోయిందని సంతోషంగా తెలిపారు ఎలిజిబెత్.  కాగా..అమెరికాలో కరోనా సోకి 30మందికి పైగా మరణించగా..వైరస్ సోకిన వారి సంఖ్య 1200లు దాటింది.