Earthquake In Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.

Earthquake In Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

earthquake

Earthquake In Afghanistan : వరుస భూకంపాలు ప్రపంచదేశాలను కుదిపేస్తున్నాయి. టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన తర్వాత ఆయా దేశాల్లో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది.

ఆదివారం తెల్లవారుజామున 2:14 గంటల ప్రాంతంలో భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. ఫైజాబాద్‌ తూర్పు ఈశాన్యానికి 273 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.

Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం, సునామీ ముప్పుపై అధికారులు ఏమన్నారంటే..

భూమికి 180 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీట్ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.