Earthquake : జపాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.6గా నమోదు

జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది.

Earthquake : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన తర్వాత ప్రపంచంలోని పలు చోట్ల భూకంపాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జపాన్(Japan)లో స్వల్ప భూకంపం(Earthquake)  సంభవించింది. ఇజు ద్వీపం(Izu Islands)లో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత(Magnitude)  4.6 గా నమోదు అయిందని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూమి లోపల 28.2 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది.

భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఇజు ద్వీపం అగ్ని పర్వతాలకు నెలవు. దీంతో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూవుంటాయి. రెండు రోజుల క్రితం ఆఫ్ఘానిస్తాన్ లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 గా నమోదు అయింది. దీని ప్రభావంతో పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది.

Turkey Earthquake 2023: టర్కీలో భూకంపం వల్ల భారీగా ఆర్థిక నష్టం.. ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే ..

పాకిస్తాన్ లోని పలు నగరాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో 16 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక భారత్ లోని ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లో భూకంపం వచ్చిందది. అలలాగే తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, తజస్థాన్, ఉబ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్ వంటి పలు దేశాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

ట్రెండింగ్ వార్తలు