Amazon forest : అమెజాన్ అడవుల్లో కూలిన విమానం .. రెండువారాలకు చంటిబిడ్డతో సహా ప్రాణాలతో బయటపడ్డ నలుగురు చిన్నారులు

అమెజాన్ అడవుల్లో అద్భుతం చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం అమెజాన్ అడవుల్లో కూలిపోయిన విమానం ప్రమాదం నుంచి 11 నెలలు చంటిబిడ్డ ప్రాణాలతో బయటపడింది. మరో ముగ్గురు చిన్నారులు కూడా ప్రాణాలతో బయపడిన అద్భుతం జరిగింది.

Amazon forest : అమెజాన్ అడవుల్లో కూలిన విమానం .. రెండువారాలకు చంటిబిడ్డతో సహా ప్రాణాలతో బయటపడ్డ నలుగురు చిన్నారులు

Plane Crash In Amazon forest

Plane Crash In Amazon forest : రెండు వారాల క్రితం కొలంబియాలోని అమెజాన్ అడవుల్లో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కానీ 11 నెలల చంటిబిడ్డతో సహా నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు వారాలుగా ఆ అమెజాన్ చిట్టడవుల్లో చిన్నారులు ప్రాణాలతో ఉండటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. బిడ్డను ప్రాణాలతో బటయపడటం అనేది నిజంగా దేశానికి సంతోషకరమైన సమయం అని కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావ్ పెట్రో ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాలించారని వారి కష్టానికి ప్రతిఫలంగా చిన్నారులు ప్రాణాలతో దక్కారని తెలిపారు.

మే 1న అమెజాన్ అడవుల్లో ఓ విమానం కూలిపోయింది. దీంతో ఆర్మీ సిబ్బంది ఆ ప్రాంతంలో విస్తృత గాలింపు చేపట్టారు. ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారనే వారి ఆశ బుధవారం (మే 18,2023) నెరవేరింది. 11 నెలల చంటిబిడ్డ, 13 ఏళ్ల లోపున్న మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలతో ఉండటం చూసిన వారు సంతోషపడ్డారు. మే 1న ఆ విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ముగ్గురు పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. విమానంలో 11 నెల వయసున్న చిన్నారితో పాటూ 13, 9, 4 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారనే సమాచరంతో ప్రభుత్వం గాలింపు చర్యల కోసం మిలిటరీని రంగంలోకి దింపింది.

supply 20 of oxygen : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం..ప్రకృతికి ఆలవాలం..సమస్త జీవరాశికి జీవనాడి ఇదే..

మొత్తం 100 మంది సైనికులు అమెజాన్ అడవుల్లో ‘ఆపరేషన్ హోప్’పేరుతో అంగుళం అంగుళం గాలింపు చేపట్టారు. ఈ గాలింపులో వారి కష్టం ఆశ చిగురించేలా చిన్నారులు క్షేమంగా ఉన్నారని చెప్పేందుకు పలు ఆధారాలు బయటపడ్డాయి. కర్రలతో ఏర్పాటు చేసిన చిన్న గుడారం, కత్తెర, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, చిన్నారికి పాలు పట్టే సీసా, సగం తిన్న పండు వంటివి వారికి కనిపించాయి. ఆ దారి వెంట ప్రతీ అంగుళ వెయ్యి కళ్లతో గాలిస్తు ముందుకెళ్లారు. దీంతో..చిన్నారులు బతికే ఉన్నారని సిబ్బందికి నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతోనే మరింతగా గాలింపు ముమ్మరం చేశారు.

వారి గాలింపులో భాగంగా చిన్నారులు ఎటువెళ్లాలో తెలీక అడవంతా తిరిగుతున్నట్లుగా వారికి లభ్యమైన వస్తువులను బట్టి గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశారు. అలా వారి నమ్మకం నిజమైంది. బుధవారం చిన్నారుల ఆచూకీ లభించింది. 11 నెలల చంటిబిడ్డతో సహా మరో ముగ్గురు పిల్లలను అడవినుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Amazon Farest : అమెజాన్ అడవుల్లో తప్పిపోయి..30 రోజులకు బతికిబయటపడ్డ యువకుడు..ఏం తిన్నాడో ఏం తాగాడో తెలిస్తే వాంతి రావాల్సిందే..

దట్టంగా పెరిగిన అమెజాన్ అడవుల్లో మనిషి తప్పారంటే తిరిగి ప్రాణాలతో బయటపడటం అంత ఈజీ కాదు. అటువంటిది చిన్నపిల్లలు దాదాపు 15 రోజుల పాటు ప్రాణాలతోనే ఉండటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. దట్టమైన అమెజాన్ అడవులు ఆర్మీ సిబ్బంది గాలింపుకు అడ్డంకిగా మారాయి. అరుదైన జంతువులకు, ప్రాణులకు ఆలవాలమైన అమెజాన్ అడువుల్లో గాలింపు అంటే మాటలు కాదు. 40 మీటర్ల ఎత్తుంటే భారీ వృక్షాలు, రకరకాల జంతువులు గాలింపుల్లో వారి కంటపడేవి. పైగా చిన్నారులు. ప్రాణాలలో ఉండటమే అద్భతమనుకుంటే వారికి ఏం చేయాలో తెలియక భయంతో ఆ అడవుల్లో ఎటుపడితే అటు తిరిగేయటంతో ఆర్మీకి వారి జాడ గుర్తించటం చాలా కష్టమైంది. దీంతో అధికారులు హెలికాఫ్టర్లకు పెద్ద స్పీకర్లు అమర్చి చిన్నారులకు వారికి అర్థమయ్యేలా వారి మాతృభాషలో అరిచి వినిపించేవారు.మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండీ..మీకోసం మేమున్నాం..మేం వస్తున్నాం..మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళతాం అంటూ స్పీకర్లో పదే పదే చెప్పేవారు.

అలా ఎన్నో ప్రయత్నాలకు ఫలితంగా ఆర్మీ అధికారులు పిల్లల జాడ కనిపెట్టారు. ఈ గాలింపులో భాగంగా ఆ చిన్నారుల తల్లి, పైలట్, మరో ప్రయాణికుడి మృతదేహాలను మంగళవారం వారికి కనిపించాయి. పిల్లల్ని ఆర్మీ సిబ్బంది సురక్షితంగా అడవినుంచి బయటకు తీసుకొచ్చారు.విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు పైలట్.. విమానం ఇంజిన్లలో సమస్య తలెత్తినట్టు గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ఆ తరువాత కొద్దిసేపటికే రాడార్‌పై విమానం జాడ కనిపించకుండా పోయింది. కాగా విమానం ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.