Multiple Shootings In US Town: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓహాలోని బట్లర్ టౌన్ షిప్‌లో ఆ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడి గురించి గాలిస్తున్నామని ఇవాళ ఉదయం పోలీసులు తెలిపారు. స్టీఫెన్ మార్లో అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని బట్లర్ టౌన్ షిప్‌ పోలీసు అధికారి జాన్ పోర్టర్ మీడియాకు తెలిపారు. అతడు ఓహియోలనే ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.

Multiple Shootings In US Town: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురి మృతి

Multiple Shootings In US Town: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓహాలోని బట్లర్ టౌన్ షిప్‌లో ఆ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడి గురించి గాలిస్తున్నామని ఇవాళ ఉదయం పోలీసులు తెలిపారు. స్టీఫెన్ మార్లో అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని బట్లర్ టౌన్ షిప్‌ పోలీసు అధికారి జాన్ పోర్టర్ మీడియాకు తెలిపారు. అతడు ఓహియోలనే ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.

అతడి వయసు 39 ఉంటుందని, గోధుమ జుట్టు ఉంటుందని, 2007 ఫోర్డ్ ఎడ్జ్ కారులో పారిపోయాడని తెలిపారు. అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయని, ప్రమాదకరంగా మారాడని వివరించారు. అతడి ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే తమకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

అతడు ఈ కాల్పులకు పాల్పడడం వెనుక ఏదైనా కారణం ఉందా? లేదా మానసిక పరిస్థితి బాగోలేదా? అన్న విషయాలపై ఆరా తీస్తున్నామని వివరించారు. అతడిని పట్టుకోవడానికి అదనపు బలగాలను రప్పించామని అన్నారు. కాగా, అమెరికాలో పదే పదే కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు దుస్సాహసానికి పాల్పడుతున్నారు.