Dead 40 Tonnes fishes :నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన 40 టన్నుల చచ్చిన చేపలు..కంపు కొడుతున్న గ్రామాలు

లెబనాన్ దేశంలోనే అతి పొడవైన లిటాని నdw తీరంలోని కొన్ని గ్రామాలు ముక్కుపుటాలు అద్దిరిపోయేంత కంపుతో నిండిపోయాయి. కారంణం ఆ నదీ తీరానికి టన్నుల కొద్దీ చేపలు కొట్టుకొచ్చాయి. అవికూడా చచ్చిపోయిన చేపలు కావటంతో ఆ ప్రాంతంలోని గ్రామాలన్ని కంపుతో ఇబ్బంది పడ్డాయి.

Dead 40 Tonnes fishes :నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన 40 టన్నుల చచ్చిన చేపలు..కంపు కొడుతున్న గ్రామాలు

40 Tonnes Of Dead Fish Wash Up On Shore Of Polluted Lake In Lebanon

40 Tonnes Of Dead Fish Wash : అది లెబనాన్ దేశంలోనే అతి పొడవైన లిటాని నదీ తీరంలోని కొన్ని గ్రామాలు ముక్కుపుటాలు అద్దిరిపోయేంత కంపుతో నిండిపోయాయి. కారంణం ఆ నదీ తీరానికి టన్నుల కొద్దీ చేపలు కొట్టుకొచ్చాయి. అవికూడా చచ్చిపోయిన చేపలు కావటంతో ఆ ప్రాంతంలోని గ్రామాలన్ని కంపుతో ఇబ్బంది పడ్డాయి. దుర్వాసన భరించలేక గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు. ఏకంగా 40 టన్నుల చచ్చిన చేపలు నదీ తీరానికి కొట్టుకురావటంతో ఆ ప్రాంతంలోని గ్రామస్తులంతా తీవ్రమైన దుర్వాసనతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది

లెబనాన్ దేశంలోనే అతిపొడవైన నది అయిన లిటానిలో కలుషిత జలాలు కలుస్తుండడం 40 టన్నుల చేపలు చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చాయి. నదీ జనాలు కలుషితం కావటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. లిటాని నది జలాలు కలుషితం కావాటంపై సామాజిక కార్యకర్తలు కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో టన్నుల కొద్దీ జలచరాలు మత్యువాతపడ్డాయి. ప్రభుత్వం నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇదేనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నదీ తీరాల్లోని వ్యర్ధాలు నది నీళ్లల్లో కలవటంతో నది కలుషితంగా మారడాన్ని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

చచ్చిన చేపలతో నది మొత్తం దుర్గంధంగా మారుతుండడంతో వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి వాటిని అక్కడి నుంచి తొలగించే పనులు మొదలుపెట్టారు. కారౌన్ రిజర్వాయర్ వద్ద చచ్చిపడిన చేపల కళేబరాలను తొలగించారు. వేలాది చేపలు కుళ్లిపోవడంతో నది నీళ్లు కూడా కంపు కొడుతున్నాయి.

కాగా ఇక్కడ చాలా రోజులుగా పరిస్థితి ఇలానే ఉందని స్థానిక కార్యకర్త అహ్మద్ అస్కర్ తెలిపారు. నదిలోకి చెత్త, మురుగునీరు కలుస్తుండడం సహించరానిదని అన్నారు. దాదాపు 40 టన్నుల చేపలు చచ్చిపోయాయని, ఇది మంచి పరిణామం కాదని అస్కర్, స్థానిక జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లిటాని రివర్ అథారిటీ ఇందుకు గల కారణాన్ని తెలుసుకోవాలని, కలుషిత నీటిని నదిలోకి వదులుతున్న వారిని గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వైరస్ కారణంగా చేపలు విషపూరితమయ్యాయని, కాబట్టి చేపల వేటకు వెళ్లొద్దని రివర్ అథారిటీ ఈ వారం మొదట్లో హెచ్చరించింది. ‘ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే తీవ్ర విపత్తు’ అని అంటోంది. కాగా, 1959లో నిర్మించిన ఈ రిజర్వాయరులో 2018లోనే చేపల వేటను నిషేధించారు. ఇందులోని నీళ్లు జలవిద్యుదుత్పత్తికి, వ్యవసాయానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.