ఆకలితో అలమటిస్తూ..4 వేల పెంపుడు జంతువులు మృతి

  • Published By: nagamani ,Published On : October 3, 2020 / 01:03 PM IST
ఆకలితో అలమటిస్తూ..4 వేల పెంపుడు జంతువులు మృతి

4000 Pets Dead in China : ఆకలితో అలమటిస్తూ..నీటి కోసం అంగలారుస్తూ నాలుగు వేల పెంపుడు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కుందేళ్లతో పాటు మొత్తం 4 వేల మూగజీవులు ఆకలితో అలమటించి చనిపోయిన అత్యంత విషాదకరమైన ఘటన చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని లౌహె నగరంలోని డాంగ్‌షింగ్ లాజిస్టిక్స్ స్టేషన్‌లో జరిగింది.


పెంపుడు జంతువుల్ని అమ్మే సంస్థం నుంచి కష్టమర్లు ఆన్‌లైన్‌లో వాటిని కొనుగోలు చేయగా..వాటిని షిప్పింగ్ చేసే సంస్థ వద్ద వారం రోజులపాటు ఉండిపోవాల్సి వచ్చింది. జంతువుల్ని ప్యాక్ చేసిన ఉన్న పెట్టెలు షిప్పింగ్ చేస్తున్న సంస్థ వద్ద వారం రోజులపాటు చిక్కుకుపోవడంతో నాలుగు వేల మూగజీవులు ప్రాణాలు కోల్పోయారు. షిప్పింగ్ చేసే సంస్థకు..ఆన్ లైన్ లో జంతువుల్ని అమ్మే సంస్థకు కమ్యూనికేషన్ లోపంతో ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది.


జంతువులను ప్లాస్టిక్, కార్డుబోర్డు పెట్టెల్లో పంపించిన సదరు జంతు పరిశ్రమ నుంచి సమాచారం లోపం కారణంగానే ఇలా జరిగిందని చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న యుతోపియా యానిమల్ రెస్క్యూ అనే సంస్థ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చనిపోగా బతికి ప్రాణాలతో పోరాడుతున్న జంతువులను కాపాడింది.


వాటికి ఆహారం, నీరు అందించి రక్షించింది. ఈ ఘటన 4 వేల జంతువులు చనిపోగా, 1000 కుందేళ్లు, చిట్టెలుకలు, శునకాలు, పిల్లులను రక్షించారు. వాటిలో కొన్నింటిని ఆ సంస్థ దత్తత తీసుకోగా, తిండిలేక శుష్కించి అనారోగ్యం పాలైన వాటిని వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.


దీనిపై యుతోపియా యానిమల్ రెస్క్యూ ప్రతినిథులు మాట్లాడుతూ..తమకు సమాచారం అంది తాము అక్కడికి చేరుకునే సరికే పెట్టెల్లో ఉన్న కొన్ని జంతువులు చనిపోయాయి. కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వస్తోందని తెలిపారు. ఊపిరి ఆడక, నీళ్లు లేక, ఆకలితో అలమటించి చనిపోయాయని యుతోపియా వ్యవస్థాపకురాలు సిస్టర్ హువా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమైన విషయం అని..సదరు సంస్థలు సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇది జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


కరోనా మహమ్మారి సమయంలో వాటిని రవాణా చేసిన తీరు చాలా భయంకరంగా ఉందని..చివరికి మూగ జీవాల ప్రాణాలు తీసే అత్యంత దారుణ ఘటనగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.కాగా..ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌లో పెంపుడు జంతువుల విక్రయాలపై చైనాలో నియంత్రణ లేదన్న విషయాన్ని ఈ ఘటన మరోమారు తేటతెల్లం చేస్తోందన్న ఈ ఘటనతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.