Ecuador : ఇద్దరు పిల్లల కోసం లింగమార్పిడి చేయించుకున్న తండ్రి ..

ఇద్దరు కుమార్తెల కస్టడీ విషయంలో 47 ఏళ్ల వ్యక్తి భార్య నుంచి బిడ్డలను దక్కించుకునేందుకు లింగ మార్పిడి చేయించుకున్నాడు.

Ecuador : ఇద్దరు పిల్లల కోసం లింగమార్పిడి చేయించుకున్న తండ్రి ..

47 year old Ecuador man legally changes gender identity

Ecuador : దేశం ఏదైనా తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమే గొప్పదనే భావన ఉంది. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి కన్న తల్లికే పెద్ద పీట వేస్తుంది ఈ సమాజం. కానీ తల్లి బిడ్డలకు జన్మనిస్తే తండ్రి ఆ బిడ్డలను గుండెలపై పెట్టుకుని పెంచుకుంటాడు. బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. ఆ బిడ్డలు సుఖంగా జీవించటానికి తాను ఎంతైనా కష్టపడతాడు. కానీ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ముందు తేలిపోతునే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఓ తండ్రి తన బిడ్డల కోసం చేసిన త్యాగం గురించి తెలిస్తే తల్లి ప్రేమకు తండ్రి ప్రేమ ఏమాత్రం తీసిపోదని కచ్చితంగా చెప్పి తీరాలు. ఓ తండ్రి తన బిడ్డలను సంరక్షించుకోవటానికి ఏకంగా లింగ మార్పిడి చేయించుకున్నాడు. తల్లి వద్ద హింసాత్మక వాతావరణంలో పెరుగుతున్నారని అటువంటి వాతావరణంలో పెరిగితే వారికి మంచి భవిష్యత్తు ఉండదని భావించిన ఆ తండ్రి ఏకంగా కోర్టులో బిడ్డల సంరక్షణ బాద్యతలు తానే దక్కించుకోవటం కోసం ఏ తండ్రీ చేయని త్యాగం చేశారు. బిడ్డలు సంరక్షణ బాద్యతలు దక్కించుకోవటానికి లింగ మార్పిడి చేయించుకున్న ఘటన ఈక్వెడార్ లో జరిగింది.

ఈక్వెడార్‌(Ecuador)లో తమ ఇద్దరు కుమార్తెల కస్టడీ విషయంలో రెనే సాలినాస్ రామోస్ అనే 47 ఏళ్ల వ్యక్తి భార్య నుంచి బిడ్డలను దక్కించుకునేంది ఈ సాహసం చేశాడు. లింగ మార్పిడి చేయించుకున్నాడు. రెనే సాలినాస్ కు అతని భార్యకు మధ్య కోర్టులో కేసు నడుస్తోంది.పిల్లలు ఎవరి వద్ద ఉండాలి అనే కేసు విషయంలో. ఈక్వెడార్ స్థానిక చట్టాలు.. పిల్లల సంరక్షణ బాధ్యతలు తండ్రి కంటే తల్లులకు అప్పగించేందుకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో తన ఇద్దరు కూతుళ్లను తానే పెంచేలా చేసుకోవటానికి ఆ తండ్రి కోర్టు కేసు గెలవటానికి మహిళగా లింగమార్పిడి చేయించుకున్నాడు. దీనికి సంబంధించి అన్ని దృవీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించాడు.

భార్య నుంచి బిడ్డల సంరక్షణ బాధ్యతల్ని దక్కించుకోవటానికి ఆరాటపడి ఏ మగవాడు చేయని సాహసం చేసి ఈ గొప్ప తండ్రి మాట్లాడుతూ..‘ఈ దేశంలో తండ్రిగా ఉండటం ఓ శిక్షేనని వాపోయాడు. ఎందుకంటే నా కుమార్తెలు వారి తల్లితో ఒక హింసాత్మక వాతావరణంలో జీవిస్తున్నారు. ఐదు నెలలుగా నేను నా పిల్లల్ని కలవలేదు. కనీసం కంటితో కూడా చూసుకోలేదు. మహిళలకు పిల్లల సంరక్షణ బాధ్యతలు ఉంటాయని స్థానిక మా చట్టాలు చెబుతున్నాయి. ఈ చట్టాల ప్రకారంగా చూస్తే ఇప్పుడు నేను మహిళను తల్లిని కూడా. నన్ను నేను అలాగే భావించుకుంటున్నా. నా కుమార్తెలకు తల్లిలా ప్రేమానురాగాలతో పెంచుకోగలను..వారికి రక్షణ ఇవ్వగలను’ కాబట్టి నా బిడ్డలను సంరక్షించే బాద్యత కోర్టు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానని స్థానిక మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు రెనే సాలినాస్ రామోస్. మరి ఈ కేసులో కోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తోందోనని ఆసక్తి నెలకొంది..

 

,