2030 నాటికి ఈ 5 దేశాల సైన్యాలకు తిరుగుండదు. ఇండియా స్థానమెక్కడ?

  • Published By: sreehari ,Published On : August 26, 2020 / 07:06 PM IST
2030 నాటికి ఈ 5 దేశాల సైన్యాలకు తిరుగుండదు. ఇండియా స్థానమెక్కడ?

అత్యాధునిక ఆయుధాలతో ప్రపంచాన్ని సర్‌ప్రైజ్ చేసే రష్యా 2030నాటికి మరింత ఆధునికంగా మారుతుంది. కాకపోతే సూపర్ టెక్నాలజీని తయారుచేయడంలో కొంత వెనుకబడొచ్చు. ఇప్పటి మిలటరీ కాంప్లెక్స్ లు ఆనాటి పాతబడిపోవచ్చన్నది ఓ అంచనా. కోల్డ్ వార్ ముగిసింది. దానిపోతే సంప్రదాయ సైన్యకవ్యవస్థలూ వెనక్కువెళ్లిపోయాయి. ఇప్పుడు తుపాకులు పట్టుకొని, పరుగెత్తే వ్యవస్థలు కాదు కావాల్సింది.

5 Countries of Armed forces will be Strong by 2030, India where will be there?

ఎక్కడో ఉండి మరోక్కడో యుద్ధం చేసే టెక్నాలజీ వార్ కావాలి. ఢిల్లీలో ఉండి పాక్ లో సైన్యాన్ని నడిపించే టెక్నాలజీ కావాలన్న మాట. ఎంత టెక్నాలజీ వచ్చినా… సైన్యం విలువ తగ్గదు. కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉంటూనే, అలజడులను అణిచివేయడం, తీవ్రవాదుల ఏరివేత ఇంకా చాలా పనులున్నాయి.



మరి 2030కి ground combat power ఎలా సిద్ధమవుతుంది? భవిష్యత్తు గురించి అంచనావేయడం చాలా కష్టం. యేడాదికేడాది పరిస్థితి మారుతోంది కదా! అయినా 2030 నాటికి ఇప్పుడున్న బలమైన ఆర్మీలే 2030నాటికి నిలబడతాయని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

5. ఇండియా:
వచ్చేకాలంలో టాప్ 5 ఆర్మీల్లో ఇండియా కొనసాగబోతోంది. సరిహద్ధుల్లో అలజడులు, తీవ్రవాదుల ఏరివేతలో భారతసైన్యానికి గొప్ప అనుభవం ఉంది. అటు చైనా, ఇటు పాక్ లను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సైనికవ్యవస్థలను సిద్ధం చేస్తోంది ఇండియా. అమెరికా నుంచి ఇజ్రాయిల్ వరకు ఆధునిక ఆయుధాలను కొంటోంది. సొంతంగా తయారుచేస్తోంది.



ఇండియాకో గొప్పగుణముంది. భారతదేశ సైన్యం ఒకవైపు ఉగ్రవాదులను అణిచివేయగలదు, అదేసమయంలో పెద్ద స్థాయి యుద్ధానికీ సిద్ధంకాగలరు. పాక్ కవ్వింపు చర్యల వల్ల సరిహద్ధులో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది ఇండియా. నిఘా పరికరాలు, మిస్సైల్స్, రాఫెల్ లాంటి యుద్ధవిమానాలు. అందుకే ప్రపంచంలో ఇండియన్ ఆర్మీ అంటే చాలా గౌరవం.

5 Countries of Armed forces will be Strong by 2030, India where will be there?

సైన్యాన్ని ఆధునికంగా తయారుచేయడంలో కొంత వెనుకబాటు కనిపిస్తుంది. అదంతా నిన్నటి మాట. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ military technology వాటిని కొంటోంది. Russia, Europe, Israel, and the United Statesల నుంచి ఆయుధాలను సమకూర్చుకోవడమేకాదు, military industrial complexతో దేశీయంగా తయారుచేసుకొంటోంది. గగనతలం, సముద్రతలం మీద మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సి ఉంది.



తిరుగులేని మిలటరీగా తయారుకావడానికి సరైన రూట్‌లోనే వెళ్తోంది ఇండియా. మన సైన్యానికి కావాల్సింది ఆయుధాలు, అత్యాధునిక ఆయుధవ్యవస్థలు. వాటిని సమకూర్చేపనిలోనే ఉంది

.4. ఫ్రాన్స్ :
సైనికంగా యూరోప్ చాలా అత్యాధునికం. తక్కువ జనాభా ఉన్నా సైనికంగా మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రాన్స్. ప్రపంచ రాజకీయాల్లో గొప్ప పాత్ర పోషించాలన్నది ఫ్రాన్స్ స్ట్రాటజీ. దానికి కావాల్సి సైన్యం ఆ దేశానికి ఉంది. ఇప్పుడు తన దేశమేకాదు, మొత్తం యూరోప్‌కే సైనికంగా పెద్దన్నగా ఉండాలన్నది ఫ్రాన్స్ కోరిక. దానికోసం సైన్నాన్ని ఎప్పటికప్పుడు కొత్త దారిలో నడిపించడమేకాదు, యుద్ధవిమానాలు, మిస్సైల్స్, యుద్ధనౌకలను ఎగుమతి చేస్తుంది.

ఫ్రాన్స గొప్పతనమే ఇది. France’s military industrial complex సొంత అవసరాలను తీర్చడమేకాదు, ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. modern command and communications equipment తయారీలో ఫ్రాన్స్‌కు తిరుగులేదు. tanks and artillery రంగంలో ఫ్రాన్స్ చాలా ముందుంది కాబట్టే ఇతర ఐరోపా దేశాలకు వెన్నుముకలా నిలబడింది.



సైనిక రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహం బట్టే ఫ్రాన్స్ ఆర్మీ 2030 నాటికి తిరుగుండదు.సైనిక పోరాటాల్లో ఫ్రాన్స్ ఆర్మీకి చాలా అనుభవముంది. పొరుగుదేశాలపై యుద్ధానికెళ్లకపోయినా, అఫ్ఘనిస్తాన్, ఇరాక్, యుఎన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. ఉగ్రవాదకార్యకలపాల నిరోధంలో elite forcesని బరిలోకి దించింది.

ఫ్రాన్స్ సైన్యానికి రెండు విభాగాల నుంచి గొప్ప సహకారం అందుతోంది. ఒకటి Marine Nationale.నేల మీద స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టడంలో ఈ విభాగానికి చాలా అనుభవం. ఒక రెండోది. ఎయిర్ ఫోర్స్. భూతల యుద్ధాలకు ఆకాశం నుంచి సపోర్ట్ ఇచ్చే ఎయిర్ ఫోర్స్, battlefield strike, transport, and reconnaissanceలో చెలరేగిపోతోంది. కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేసే శక్తి ఫ్రాన్స్‌కు ఉంది.

3.రష్యా:
రెండో ప్రపంచ యుద్ధం నుంచి తిరుగులేని సైనిక శక్తిగా అమెరికాతో తలపడుతున్న రష్యా, చైనా రాకతోనే మూడో స్థానానికి పడిపోనుంది. కోల్డ్ వార్ తర్వాత రష్యన్ ఆర్మీ, ముక్కచెక్కలైంది. సైనికులు, సైంటిస్ట్ లు, వనరులను కోల్పోయింది. రెడ్ ఆర్మీకి ఆయుధ వ్యవస్థలను తీర్చిదిద్దే military-industrial complex నెమ్మదిగా కుప్పకూలింది. మిగిలింది పనికిరాని ఆయుధాలు, పాతబడిన ఆయుధ కర్మాగారాలు. సైన్యంలో ధైర్యం తగ్గింది. అందుకే చైనా తిరుగుబాటుదారులతో సరిగా పోరాడలేకపోయింది.

అలాగని ఇప్పుడు పరిస్థితి మారినా, అన్నీ మోడర్న్ కాలేదు. కాకపోతే పెరిగి ఆర్థికవ్యవస్థ ఆర్మీకి నిధులను సమకూర్చింది. Reform. ఇదే రష్యా మంత్రం. ముఖ్యం స్పెషల్ ఫోర్స్ ను గొప్పగా తీర్చిదిద్దింది. అందుకే చైనాలో గెల్చింది.



2008 జార్జియాని కొన్ని వారాల్లోనూ విజయం సాధించింది. అంతెందుకు 2014లో Ukraineనుంచి Crimeaను స్వాధీనం చేసుకోవడానికి కారణం ఈ స్పెషల్ ఫోర్సెస్. ఈ విజయాలతో రష్యా సామార్ధ్యం ఏంటో ప్రపంచానికి తెలిసింది. రష్యా సైనిక పునాదులూ పటిష్టమైయ్యాయి. రష్యా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పుతిన్ సైనిక వ్యూహాలు బాగా పని చేస్తున్నాయంటే కారణం ఈ సైన్యమే. నేవీ, ఎయిర్ ఫోర్స్ రాకతో కొంత ప్రాధాన్యత తగ్గినా, రష్యా అంటే… ఉరకలెత్తే స్పెషల్ ఆర్మీయే. s-400 లాంటి మిస్సైల్ వ్యవస్థలు, ట్యాంక్‌లు, సుఖోయ్‌లు, సూపర్ సోనిక్ మిస్సైల్స్ తో రష్యా 2030నాటికీ ఏ ప్రాంతానైనా రణరంగంగా మార్చగలరు. ఏ దేశాన్ని అయినా గట్టిదెబ్బకొట్టగలదు.

Part-1 : 2030నాటికి అమెరికాను చైనా దాటేయగలదా?